కుటుంబం కలహాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకూ పెరిపోతున్నాయి. అయితే కలహాలు తెంచే పోలీసులు కూడా ఫ్యామిలీ గొడవలతో ప్రాణాలు తీసుకుంటుండటం ఆందోళనకు గురిచేస్తోంది. లేటెస్టుగా కుటుంబ కలహాలతో వరంగల్ జిల్లాలో ఎస్సై ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ లో శనివారం (నవంబర్ 01) కుటుంబ కలహాలు తాళలేక ఎస్ఐ ఎండీ ఆసిఫ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు ఎస్సై ఆసిఫ్. ఖానాపూర్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పనిచేస్తున్న ఆసిఫ్.. ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఇటు పోలీసు శాఖలోనూ, అటు బంధువర్గంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
►ALSO READ | కడెం ప్రాజెక్టులో కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయుడు గల్లంతు
