రాబోయే రెండు నెలల్లో 79కు పడనున్న రూపాయి విలువ

రాబోయే రెండు నెలల్లో 79కు పడనున్న రూపాయి విలువ

న్యూఢిల్లీ: డాలర్​తో రూపాయి మారకం విలువ రాబోయే రెండు నెలల్లో 79 స్థాయికి పడుతుందని ఎనలిస్టులు అంటున్నారు. డాలర్​తో ​రూపాయి మారకం విలువ పోయినవారం 77.97 వద్ద మొదలైంది. ఆల్‌ టైమ్ కనిష్టమైన 78.40‌‌ లెవెల్‌కు పడిపోయిన రూపాయి,  చివరికి 77.87 లెవెల్‌ వద్ద సెటిలయ్యింది. చాలా ఆసియా కరెన్సీలు కూడా బలహీనంగా ఉన్నాయి. రూపాయి 78.40 స్థాయిల వద్ద ఉన్నప్పుడు ఆర్​బీఐ జోక్యం చేసుకుంది. పోయినవారంలో ఇది 78.3450 వద్ద ముగిసింది.  చమురు కంపెనీలు,  ఫారిన్​ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌పిఐలు) డాలర్లను భారీగా కొనుగోలు చేయడం ఇందుకు ప్రధాన కారణాలు. బ్రెంట్ ఆయిల్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌ ధర 105 డాలర్ల పైన స్థిరంగా ఉంది. ఇది ఇటీవల125  డాలర్ల గరిష్ట స్థాయి నుండి పడిపోయింది. మన  చమురు అవసరాల్లో 83 % దిగుమతులే ఉన్నాయి. దిగుమతులు ఎక్కువగా ఉంటే మన కరెంట్ ఖాతా,  వాణిజ్య ఖాతా లోటు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక పోటీతత్వాన్ని పెంచడానికి ఆర్​బీఐ  డాలర్​కి వ్యతిరేకంగా రూపాయిని బలహీనపరచడం తప్ప మరోమార్గం లేదు. యూఎస్​ ఫెడ్ వడ్డీరేట్లను​ ఇప్పటి వరకు 175 బేసిస్​ పాయింట్ల రేట్లు పెంచగా, ఆర్​బీఐ 110 బేసిస్​ పాయింట్ల మాత్రమే పెంచడంతో డాలర్–  రూపాయి మధ్య వడ్డీ రేటు తేడా తగ్గుతోంది.  యుఎస్‌‌‌‌‌‌‌‌లో ఇటీవలి మాంద్యం అంచనాలు స్టాక్ మార్కెట్లతోపాటు రూపాయినీ దెబ్బతీశాయి.