మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పట్టణానికి చెందిన చిరు వ్యాపారి ఆనంద్‌కుమార్ సేవలను గుర్తించి హౌప్ ఇంటర్నేషనల్ వరల్డ్ గౌరవ డాక్టరేట్‌ను అందించింది. హైదరబాద్ రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో లిటిల్ చాంప్ట్ అకాడమీ ఆఫ్ ఇండియాకు చెందిన కేశవరావు అవార్డును అందజేసి అభినందించారు. నిరుపేదలకు ఆర్థికసాయం చేయడంతో పాటు నిరాశ్రయులు, అనాథలు, వృద్ధులు, వికలాంగులకు సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు 32 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.
