మల్టీ రైడర్ ప్యాసింజర్ వెహికిల్ వీడియోను పంచుకున్న ఆనంద్ మహీంద్రా

మల్టీ రైడర్ ప్యాసింజర్ వెహికిల్ వీడియోను పంచుకున్న ఆనంద్ మహీంద్రా

ఎప్పుడూ వెరైటీ వీడియోలను షేర్ చేస్తూ.. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో సైకిల్ తరహాలో కనిపిస్తున్న ఓ వాహనంపై ఒకేసారి ఆరుగురు ప్రయాణిస్తున్నారు. చిన్న చిన్న పరికరాలతో తయారు చేసిన ఈ వాహనం.. గ్లోబల్ అప్లికేషన్ ను కనుగొనగలదని ట్వీట్ చేశారు. ఇది రద్దీగా ఉండే యూరోపియన్‌ దేశాల్లో టూర్ బస్సా అన్న ఆనంద్ మహీంద్రా.. తానెప్పుడూ గ్రామీణ రవాణా ఆవిష్కరణలకు ఇంప్రెస్ అవుతుంటానని, ఈ వాహనం ఆవిష్కరణకు మాతృక ఎక్కడ ? అని ఆయన రాసుకొచ్చారు.

ఈ వీడియోలో ఈ వాహనం విలువ రూ.12వేలు అని, ఒక్కసారి చార్జింగ్​ ​ చేస్తే 150 కి.మీల వరకు ప్రయాణిస్తుందని వీడియోలో ఓ వ్యక్తి పేర్కొన్నాడు. అంతే కాకుండా వాహనాన్ని కేవలం రూ.10 కి చార్జింగ్​ చేయవచ్చని కూడా అతను పేర్కొన్నాడు. కొన్ని గంటల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు ట్విట్టర్‌లో 68,000 కంటే ఎక్కువ వ్యూస్ రాగా... ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.