
ప్రముఖ నాట్య గురువు వోలేటి రంగమణి శిష్యురాలు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ కుమార్తె అనన్య కూచిపూడి అరంగేట్ర ప్రదర్శన శనివారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగింది. గణపతి కీర్తన, భామ కలాపం, జావలి, తిల్లానా, సింహనందిని అంశాలతో వీక్షకులను ఆకట్టుకుంది. అనన్య యూకేలోని లివర్పూల్ వర్సిటీలో ఎల్ఎల్బీ (ఆనర్స్) చదువుతూ 10 ఏండ్లుగా కూచిపూడి శిక్షణ తీసుకుంటోంది. - వెలుగు, బషీర్బాగ్