
యాంకర్ కం నటి అనసూయ భరద్వాజ్ (AnasuyaBharadwaj).. పరిచయం అక్కర్లేని పేరు. పేక్షకుల్లోనే కాదు.. సోషల్ మీడియా యూత్లో కూడా మంచి ఫాల్లోవింగ్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాను ఏం పోస్ట్ చేసిన ఇట్టే క్షణాల్లో వైరల్ అయ్యేంత ఫాల్లోవింగ్ సంపాదించుకుంది. అదేవిధంగా తనపై వచ్చే గుడ్, బ్యాడ్ కామెంట్లకి తగ్గట్టుగా రియాక్ట్ అవుతూ వస్తోంది.
ఇటీవలే తాను పోస్ట్ చేసిన పలు ఫోటోలకు నెటిజన్ల నుంచి భిన్నరకాలుగా కామెంట్స్ వచ్చాయి. అదే స్థాయిలో ట్రోలింగ్స్ కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అనసూయ అన్నీటికీ క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్లో ఓ సంచలన పోస్ట్ పెట్టింది.
“నేను ఒక భార్యను, ఇద్దరు పిల్లల తల్లిని. నా వ్యక్తిగత స్టైల్ కు తగ్గట్టుగా డ్రెస్సెస్ వేసుకోవడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే, గ్లామర్, స్టైల్, కాన్ఫిడెన్స్ ఎప్పుడూ నా గుర్తింపులో అంతర్భాగం. ఈ క్రమంలో బోల్డ్ గా ఉంటే తప్పేంటీ? తాను స్వతంత్రంగా జీవిస్తున్నానని, ఎవరినీ తనను ఫాలో కావాలని చెప్పడం లేదని అనసూయ స్పష్టం చేసింది.
అలాగే, కొందరు తల్లిగా ఉన్నప్పుడు ఇదంతా జరగదని, ఇలాంటివి సరికాదని నమ్ముతారు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.. తల్లి కావడం అంటే మీ నిజమైన స్వభావాన్ని వదులుకోవడమా? నా కుటుంబం, నా భర్త, పిల్లలు.. నేను ఎలా ఉన్నానో అలా నన్ను ప్రేమిస్తారు. వాళ్లు నన్ను జడ్జ్ చేయరు. వారు నాకు పూర్తి సపోర్ట్ ఇస్తారు. అదే నాకు ముఖ్యమైనది. కొంతమందికి ఈ స్థాయి ఓపెన్‌నెస్ వేసుకోవడం అలవాటు ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను.
ఇకపోతే.. మీరు మీ జీవితాన్ని జీవించాలనుకున్నట్లే, నేను నా జీవితాన్ని జీవించే స్వేచ్ఛను కోరుకుంటున్నాను. ఇది చూస్తున్న అందరికీ ఒక్కటే చెప్పదలచుకున్నారు. మీ ఆలోచనలను చూసి నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. ఇతరుల లైఫ్ స్టైల్స్ పట్ల మీరు అదే గౌరవం చూపుతారని ఆశిస్తున్నాను.
మన మధ్య ఉండే విభేదాలను వ్యక్తిగత దాడులు చేయకుండా ప్రశాంతంగా అంగీకరించగలిగితే, మనమందరం కలిసి ప్రశాంతంగా జీవించగలం. నేను ఎల్లప్పుడూ ఇతరుల పట్ల గౌరవాన్ని కొనసాగిస్తూ గర్వంగా, ప్రేమగా మరియు నిస్సందేహంగా జీవించడం కొనసాగిస్తాను.. మీరు కూడా అలానే ఉండండి’’అని నెటిజన్లకు ఇచ్చేపడేసింది.