
సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 96 వ ఆస్కార్ అవార్డు వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. గత ఏడాది జరిగిన ఈ అవార్డు వేడుకలో ఆర్ఆర్ఆర్ సినిమా మెరిసి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సారి చాలా సినిమాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
అందులో ఓపెన్ హైమర్ ఏడు విభాగాల్లో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇంతవరకు సోషల్ మీడియాలో ఓపెన్ హైమర్ గురించి మాత్రమే వింటూ వస్తోన్నం. ఇక ఇపుడు ఆస్కార్ అవార్డులో జరిగిన ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Ryan Gosling’s face lighting up after he sees Messi, the dog from Anatomy of a Fall, clapping on the big screen at the Oscars LOL pic.twitter.com/maKz53vAHp
— Spencer Althouse (@SpencerAlthouse) March 11, 2024
వివరాల్లోకి వెళితే..వేడుకలో ఓ శునకం అందరి దృష్టిని ఆకర్షించింది.సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే ప్రస్తావన మొదలైంది.ఆస్కార్ కోసం వివిధ విభాగాల్లో పోటీపడిన మూవీస్ లో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ ఒకటి. ఈ మూవీ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది.
Messi the dog clapping is definitely a highlight so far!!! #Oscars #MessiTheDog pic.twitter.com/RrT66nkexh
— Tom Harmer (@RealTomHarmer) March 11, 2024
ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో నటించిన మెస్సీ (శునకం) కూడా ఈ అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చింది. ఇక్కడ హైలెట్ ఏంటంటే..ఈ వేడుకలో అవార్డులు అందుకున్న వారిని ప్రోత్సహిస్తూ చప్పట్లు కూడా కొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో వెరీ స్పెషల్ మెస్సీ అంటూ అక్కడున్న స్టార్స్ అందరు దానితో సెల్ఫీలు దిగారు.
Messi in the audience at the #Oscars.
— Film Updates (@FilmUpdates) March 10, 2024
pic.twitter.com/RwFUCRhRyL
ప్రస్తుతం మెస్సీ చప్పట్లు కొడుతున్న వీడియో తో పాటు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ విభిన్నమైన శైలిలో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అందులో ఒకరు ‘దీనికి ఇప్పుడే ఆస్కార్ ఇవ్వండి’ అని కామెంట్ పెట్టగా..‘మెస్సీ ది డాగ్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు తీసుకోడానికి సిద్ధంగా ఉందంటూ మరొకరు పోస్ట్ పెట్టారు.‘ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో మెస్సీ చప్పట్లు బెస్ట్ మూమెంట్’ అని ఇంకొకరు స్పందించారు. ఆఇపుడు మీరు కూడా చూసేయండి మెస్సీ హంగామా..
And the Oscar should go to… ?#messithedog #snoop #AnatomyofaFall #Oscars2024 #OscarsLive @TheAcademy pic.twitter.com/ZJMl72Ud5i
— Mrs. Patricia J. Leister (@17lifeisgood) March 11, 2024