
బుల్లితెర ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట్లో విషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు(65)కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో భాదపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ప్రదీప్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రచారం జరిగింది. దీనిపై ప్రదీప్ స్పందించలేదు. ఈ టీవీలో వచ్చే ఢీ, జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ ప్రొగ్రామ్ లకు ప్రదీప్ యాంకర్ గా చేస్తున్నారు.