Aadujeevitham: పక్కటెముకలు బయటకు కనిపించే సీన్లో..కళ్లల్లో నీళ్లు తిరిగాయి: యాంకర్ సుమ

Aadujeevitham: పక్కటెముకలు బయటకు కనిపించే సీన్లో..కళ్లల్లో నీళ్లు తిరిగాయి: యాంకర్ సుమ

మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య ప్రభాస్ తో సలార్ సినిమాలో నటించిన ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. పృథ్వీరాజ్ ది గోట్ లైఫ్(The Goat Life) తెలుగులో ఆడు జీవితం గురువారం (మార్చి 28న) థియేటర్లో రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.

ఈ మూవీకి ఎక్కడ చూసిన అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దాదాపు ఐదేళ్లు ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా కష్టపడ్డ పృథ్వీరాజ్ అసాధారణ నటనను ఇండస్ట్రీ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు.  

తాజాగా ఈ సినిమా చూసిన ప్రముఖ తెలుగు యాంకర్ సుమ తమ అభిప్రాయాన్ని పంచుకుంది. " ‘ఆడు జీవితం’ సినిమా చూశా. న‌జీబ్ మహ్మ‌ద్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్) కథను చాలా వివరంగా మనసుని హత్తుకునేలా తెలియజేశారు. కళ్ళకు కట్టినట్లుగా తెరకెక్కించిన దర్శకుడు బ్లెస్సీకి నా సెల్యూట్‌. ఈ ,సినిమా కోసం పృథ్వీరాజ్‌..పూర్తిగా బరువు తగ్గిపోయి, పక్కటెముకలు బయటకు కనిపించే సన్నివేశంలో..ఆ అసాధారణ నటనలో మిమ్మల్ని చూసి నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సినిమా పట్ల మీకు ఉన్న ప్రేమ, అంకితభావానికి ఇది నిలువెత్తు నిదర్శనం’’ అంటూ రాసుకొచ్చారు సుమ.

ఆడు జీవితం క‌థేంటంటే: 

న‌జీబ్ మహ్మ‌ద్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్) (Prithviraj Sukumaran) ఉపాధి కోసమ‌ని త‌న స్నేహితుడు హ‌కీం (కేఆర్ గోకుల్‌)తో క‌లిసి సౌదీ వెళ్తాడు. ఏజెంట్ చేసిన మోసం కార‌ణంగా అనుకున్న ఉద్యోగం దొర‌క్క‌పోగా, బ‌ల‌వంతంగా గొర్రెల్ని కాయ‌డం కోసం తీసుకెళ‌తాడు య‌జ‌మాని. వెళ్లిన ఇద్ద‌రినీ వేర్వేరు చోట్ల వ‌దిలిపెడ‌తాడు. భాష తెలియ‌క, ఎడారి మ‌ధ్య‌లో స‌రైన తిండి, నీళ్లు లేక, య‌జ‌మానుల వేధింపుల‌తో ఎన్నో అవ‌స్థ‌లు ప‌డ‌తాడు న‌జీబ్‌. అక్క‌డి నుంచి త‌ప్పించుకుని తిరిగి వెళ్లిపోవాల‌నుకున్న అతడు చివరికి ఏం చేశాడు? త‌న‌తోపాటు వ‌చ్చిన హ‌కీంని అసలు క‌లిశాడా? త‌న కుటుంబాన్ని మ‌ళ్లీ క‌లుసుకున్నాడా? అనేది ఈ సినిమా కథ.