ఖబరస్తాన్ లో పురాతన రాగి రేకులు స్వాధీనం

ఖబరస్తాన్ లో పురాతన రాగి రేకులు స్వాధీనం
  • చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు మట్టి తీస్తుండగా లభ్యం
  • సూర్యాపేట జిల్లాలో కోదాడలో ఘటన

కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడలో ముస్లింలకు చెందిన ఖబరస్తాన్ (శ్మశానవాటిక)లో పురాతన రాగి రేకులు దొరికాయి. మంగళవారం చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు ఖబరస్తాన్ లో గుంత తీస్తుండగా, రాగి రేకులు బయటపడ్డాయి. స్థానిక వక్ఫ్ బోర్డు సభ్యులు.. పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలిపారు. కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెళ్లి వాటిని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.

 అనంతరం డీఎస్పీ ఆఫీసులో ప్రెస్ మీట్ లో అధికారులు మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న రాగి రేకులపై వివిధ భాషల్లో రాతలు ఉన్నాయని తెలిపారు. దీనిపై కలెక్టర్ కు తెలియజేశామని, వాటిని పురావస్తు శాఖకు అప్పగించనున్నట్లు చెప్పారు. కోదాడ తహసీల్దార్ వాజిద్ అలీ, ఆర్ఐ రాజేశ్, టౌన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి ఉన్నారు.