
అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్‌లో రోడ్డు విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాల్లో పురాతన విగ్రహం బయటపడింది. హాస్పిటల్ ముందు తవ్వుతుండగా ఈ విగ్రహం బయటపడగా, కూలీలు గుర్తించి బయటకు తీశారు. రాతిబండపై దేవతామూర్తి చెక్కి ఉంది. పురావస్తు శాఖ అధికారులు ఈ విగ్రహాన్ని పరిశీలిస్తే ఏ కాలానికి చెందినదనే విషయం తెలుస్తుందని స్థానికులు తెలిపారు. స్థానికులు విగ్రహానికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహం బయటపడిన ప్రాంతంలోనే గుడి నిర్మించాలని గ్రామస్తులుకోరుతున్నారు.