చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ నోటీసులు

చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ నోటీసులు

హైదరాబాద్ : తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి చింత‌కాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు నోటీసులు అంటించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో ఉన్న చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో విజయ్ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. 41 సీఆర్ పీసీ ప్రకారం నోటీసులు అంటించారు. ఈ నెల 6వ తేదీన ఉదయం పదిన్నరకు.. ఓ కేసు విషయంలో మంగళగిరి సీఐడీ ఆఫీస్ లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

సోషల్ మీడియా పోస్టులపై గతంలో చింతకాయల విజయ్ పై సీఐడీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వాడుతున్న సెల్ ఫోన్స్, నెంబర్స్ తో పాటు ఐడీ, అడ్రస్ ప్రూఫ్ తో హాజరు కావాలని చింతకాయల విజయ్ ను ఆదేశించారు. ఒకవేళ మంగళగిరి సీఐడీ ఆఫీస్ లో హాజరు కాని పక్షంలో 41A(3),(4) సీఆర్ పీసీ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో తెలియజేశారు.