ఏపీ బడ్జెట్: కోవిడ్ పై పోరుకు రూ.1000 కోట్లు

ఏపీ బడ్జెట్:  కోవిడ్ పై పోరుకు రూ.1000 కోట్లు

ఏపీ అసెంబ్లీలో 2021-22 బడ్జెన్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశ పెట్టారు. 2021–22 రాష్ట్ర బడ్జెట్ రూ. 2,29,779.27 అంచనగా రూపొందించినట్లు  చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తో పోలిస్తే వెనుకబడిన కులాలకు 32 శాతం అధికంగా కేటాయించామన్నారు.

బడ్జెట్ లో  కేటాయింపులు

  • 2021-22 బడ్జెట్ అంచనా రూ.2,29,779 కోట్లు
  • గత బడ్జెట్ అంచనా .2,24,789 కోట్లు
  • కోవిడ్‌పై పోరాటానికి రూ. 1000 కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ. 13,840.44 కోట్లు
  • ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 6,131కోట్లు
  • మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌కింద రూ. 3,840.72 కోట్లు
  • కాపు సంక్షేమం కోసం రూ. 3,306 కోట్లు
  • వ్యవసాయ పథకాలకు కేటాయింపులు 11,210 కోట్లు
  • విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు
  • వైద్యం– ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
  • వైయస్సార్‌ బీమాకు రూ. 372.12 కోట్లు
  • కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం రూ. 250 కోట్లు
  • విద్యారంగానికి రూ. 24,624.22 కోట్లు
  • జగనన్న విద్యాకానుక కోసం రూ. 750 కోట్లు
  • ఉన్నత విద్యకోసం రూ. 1,973 కోట్లు
  • వైయస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 17,000 కోట్లు
  • వైయస్సార్‌ రైతు భరోసాకు రూ. 3,845 కోట్లు
  • జగనన్న విద్యా దీవెనకు రూ.2500 కోట్లు
  • వైయస్సార్‌ ఆసరా కోసం రూ. 6,337 కోట్లు
  • అమ్మ ఒడి కోసం రూ. 6,107 కోట్లు
  • వైయస్సార్‌ చేయూత కోసం రూ. 4,455 కోట్లు
  • రైతుల పథకాలకు రూ. 11,210.80 కోట్లు
  • వైయస్సార్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ. 88.57 కోట్లు
  • వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి రూ. 1802.82 కోట్లు
  • వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ. 739.46 కోట్లు
  • వైయస్సార్‌ పశువుల నష్టపరిహార పథకానికి రూ. 50 కోట్లు