ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖారైంది. 25 మంది పేర్లను ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు.. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన ను తిరిగి మంత్రివర్గంలో కొనసాగించారు. గతంలో మంత్రి పదవి ఆశించిన ఆర్కే రోజాకు ఈ సారి చోటు దక్కింది.  సీదిరి అప్పలరాజు, పి.రాజన్నదొర, గుడివాడ అమర్ నాథ్, బూడి మూత్యాలనాయుడు, ధర్మానప్రసాదరావుకి కేబినెట్ బెర్త్ ఖరారు చేశారు. చెల్లుబోయిన వేణు, దాడి శెట్టి రాజా, పినిపె విశ్వరూప్ , కొట్టు సత్యనారాయణమూర్తి, తానేటి వనిత, కామూరి నాగేశ్వరరావు,జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున , విడుదల రజిని, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరామ్, నారాయణస్వామి పేర్లను జగన్ ఖరారు చేశారు. కొత్త మంత్రుల జాబితాను ముఖ్యమంత్రి గవర్నర్ కు పంపనున్నారు. వెంటనే గవర్నర్ ఆమోదం తెలపనున్నారు. 

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై మూడు నాలుగు రోజుల నుంచి జగన్ కసరత్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సుదీర్ఘంగా చర్చించిన జగన్.. 2024 ఎన్నికల లక్ష్యంగా కేబినెట్ కూర్పు చేశారు. మంత్రి పదవులు కోల్పోయినవారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు. అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం అవసరాలే ప్రాతిపదికన కేబినెట్ కూర్పు చేశారు. రేపు వెలగపూడి సచివాలయ భవన సముదాయం పక్కనున్న పార్కింగ్  స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. తర్వాత ముఖ్యమంత్రి గవర్నర్ తో కలిసి కొత్త మంత్రులతో తేనేటి విందులో పాల్గొంటారు. 

తెలంగాణ రైతులకు బండి సంజయ్ బహిరంగ లేఖ

నేను భారతీయుడిని.. తెలుగువాడిని, తెలంగాణవాడిని

యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి