అభివృద్ధి పనులకు మంత్రి దామోదర శంకుస్థాపనలు.. ఎప్పుడంటే..!

అభివృద్ధి పనులకు  మంత్రి  దామోదర శంకుస్థాపనలు.. ఎప్పుడంటే..!

జోగిపేట, పుల్కల్, వెలుగు : అందోల్​ నియోజకవర్గంలో గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ   పర్యటించనున్నారు. రూ. 31.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సుల్తాన్పూర్​లో  కేజీబీవీ పాఠశాల భవన నిర్మాణానికి,  అందోల్​లో అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీకి వెల్కమ్ ఆర్చ్ కమాన్​లకు శంకుస్థాపనలు చేయనున్నారు.  పాలిటెక్నీక్ కళాశాల వద్ద బస్ షెల్టర్లను  ప్రారంభించనున్నారు. 

రూ. 2.20 కోట్లతో కేజీబీవీ పాఠశాల భవనంలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించనున్నారు.  సోషల్​ వెల్పేర్​ రెసిడెన్షియల్ పాఠశాల  భవనంలో నిర్మించిన పేరెంట్స్ వెయిటింగ్ హాల్, టాయిలెట్స్​  ప్రారంభిస్తారు. రూ. 5.75 కోట్లతో ఆర్డీవో కార్యాలయం, నివాస గృహాల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.  ఐసీడీఎస్ కార్యాలయ భవనం  నిర్మాణానికి శంకుస్థాపన,  రూ. 2 కోట్లతో స్వామి  వివేకానంద పార్క్ లో సుందరీకరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 

జోగిపేటలో రూ. 7.23 కోట్లతో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ లో కాంపౌండ్ వాల్, షాపింగ్ కాంప్లెక్స్, రైతు వెయిటింగ్ హాల్​ పనులకు శంకుస్థాపన చేస్తారు.  అందోల్ మండలం నేరడిగుంటలో రూ. 2.45 కోట్లతో పీహెచ్​సీ భవన నిర్మాణానికి జోగిపేట మార్కెట్ యార్డ్ లో శంకుస్థాపన చేస్తారు.  రూ. 5 లక్షలతో జోగిపేటలో నిర్మించిన  ఇందిరమ్మ మోడల్ హౌజ్​ను మంత్రి ప్రారంభిస్తారు.