
కోల్‌కతా: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ అపాయింట్ అయ్యాడు. గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన ఫ్లవర్ కొత్త టీమ్‌తో జాయిన్ అవ్వబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని ప్రకటించాడు. ప్లేయర్, కోచ్‌గా క్రికెట్ హిస్టరీలో ఫ్లవర్ తనదైన మార్క్ సెట్ చేశాడని లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా అన్నారు. కాగా, ఇండియా స్టార్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ లక్నో టీమ్ కెప్టెన్‌గా ఎంపికవ్వడం లాంఛనమే అని సమాచారం. కేఎల్‌తో ఫ్రాంచైజీ ఇప్పటికే డీల్ కుదుర్చుకుందని, తొందర్లోనే అధికారిక ప్రకటన ఇస్తుందని తెలుస్తోంది. పాత టీమ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్ల నుంచి మెగా ఆక్షన్‌కు ముందు చెరో ముగ్గురిని ఎంచుకునేందుకు లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలకు ఈ నెల 25 వరకు చాన్సుంది. రాహుల్‌తో పాటు లాస్ట్ సీజన్ వరకు సన్ రైజర్స్‌కు ఆడిన అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ముంబై ఇండియన్స్ కీపర్ ఇషాన్ కిషన్‌ను ఎంచుకోవాలని లక్నో చూస్తోంది. మరోవైపు సీవీవీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ.. ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాతో చర్చలు జరుపుతోంది. అయ్యర్‌కు కెప్టెన్సీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.