
పదిసార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఆంగ్ రీటా సెర్పా మృతి
ఖాట్మండు: నేపాల్‌కు చెందిన మౌంటెనీర్ ఆంగ్ రీటా సెర్పా సోమవారం మరణించారు. బాటిల్ ఆక్సిజన్ లేకుండా ప్రపంచంలోని ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్‌ను పదిసార్లు ఎక్కిన రీటా.. లివర్, బ్రెయిన్ సమస్యలతో బాధపడుతూ మృతి చెందారని మౌంటెయినీరింగ్ అసోసియేషన్ చెప్పింది. 1983 నుంచి 1996 మధ్య కాలంలో ఆక్సిజన్ సిలిండర్ లేకుండా పదిసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించారు. తన అడ్వంచర్స్‌తో స్నో లెపర్డ్‌గా పేరు పొందిన 72 ఏండ్ల రీటా ఖాట్మండులోని తన ఇంట్లో చనిపోయారని నేపాల్ మౌంటెయినీరంగ్ అసోసియేషన్ సెక్రెటరీ తికారాం గురుంగ్ తెలిపారు. సోలుఖంబులోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రీటాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1987 డిసెంబర్ (వింటర్ సీజన్)లో ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ అధిరోహించినందుకు గాను గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.
For More News..