ఏంజెల్ వన్ క్లయింట్స్ బేస్‌‌‌‌ పైపైకి

ఏంజెల్ వన్ క్లయింట్స్ బేస్‌‌‌‌ పైపైకి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బ్రోకరేజి కంపెనీ ఏంజెల్ వన్ తన క్లయింట్స్ బేస్‌‌‌‌ను పెంచుకుంటోంది. ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ మరో 4.4 లక్షల మంది కస్టమర్లని యాడ్‌‌‌‌ చేసుకుంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఇది 82 శాతం ఎక్కువని   ఏంజెల్ వన్‌‌‌‌ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.  దీంతో కంపెనీ మొత్తం క్లయింట్స్ బేస్ 1.118 కోట్లకు చేరుకుందని తెలిపింది.  కంపెనీ సగటు రోజువారి టర్నోవర్‌‌‌‌ ఏడాది ప్రాతిపదికన 118 శాతం పెరిగి ఆగస్టులో రూ. 12.38 లక్షల కోట్లకు చేరుకుందని వివరించింది.  ‌‌‌‌

ఈ ఏడాది ఆగస్టులో 7.25 కోట్ల ఆర్డర్లను ప్రాసెస్‌‌‌‌ చేశామని, ఇది ఏడాది ప్రాతిపదికన 44.9 శాతం ఎక్కువని  ఏంజెల్ వన్‌‌‌‌ పేర్కొంది. మాక్రో పరిస్థితులు సానుకూలంగా లేనప్పటికీ  దేశంలో డీమాట్ అకౌంట్లు పెరుగుతున్నాయని, మార్కెట్‌‌‌‌లో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరుగుతోందని కంపెనీ  చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ తివారి ప్రభాకర్ అన్నారు. ఈ గ్రోత్‌‌‌‌లో ఏంజెల్ వన్‌‌‌‌ కంట్రిబ్యూషన్‌‌‌‌ ఉండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.