టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్గోపాల్ రెడ్డి అరెస్టుపై ఆగ్రహం

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్గోపాల్ రెడ్డి అరెస్టుపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ గెలిచిన మూడు స్థానాలు ఒకటి ఉత్తరాంధ్ర కాగా.. మరో రెండు రాయల సీమలో ఉన్నాయి. ఈ క్రమంలో పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల వాసి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గెలిచారు. అయితే, ఆయనకు డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుకున్నారు. దీంతో డిక్లరేషన్ ఇవ్వకుండానే కలెక్టర్ వెళ్లిపోయారు. దీన్ని తప్పుబట్టిన టీడీపీ నేతలు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాహనాలకు అడ్డుపడి ఆందోళన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్తి రామ్ గోపాల్ రెడ్డిని, ఇతర నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు అర్థరాత్రి స్టేషన్ కు తరలించారు. 

ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం అనంతపురం కలెక్టరేట్ వద్ద హై టెన్షన్ మొదలయింది. వైసీపీ, టీడీపీ పార్టీ నేతలు ఆందోలనకు దిగే అవకాశం కనిపింస్తోంది. రామ్ గోపాల్ రెడ్డిని విడుదల చేసి, డిక్లరేషన్ ఇవ్వాలని పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్, ప్రభాకర్ చౌదరి, మాదినేని ఉమామహేశ్వర నాయుడు, శ్రీధర్ చౌదరి రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ట్వీట్ చేశారు. డిక్లరేషన్ అడిగిన అభ్యర్తిని అరెస్ట్ చేయడం దారుణమని మాట్లాడారు. ప్రజా తీర్పును అంగీకరించి, అభ్యర్థులకు జగన్ మోహన్ రెడ్డి క్షమాపన చెప్పాలని అన్నారు.