‘బుట్టబొమ్మ’ చిత్రంతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇస్తోన్న అనికా సురేంద్రన్

‘బుట్టబొమ్మ’ చిత్రంతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇస్తోన్న అనికా సురేంద్రన్

ఎంతవాడు గాని, నేనూ రౌడీనే, విశ్వాసం లాంటి చిత్రాలతో చైల్డ్‌‌ ఆర్టిస్ట్‌‌గా గుర్తింపును అందుకున్న అనికా సురేంద్రన్.. ‘బుట్టబొమ్మ’ చిత్రంతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇస్తోంది. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జనవరి 26న సినిమా విడుదలవుతున్న  సందర్భంగా అనిక  సురేంద్రన్ మాట్లాడుతూ ‘చైల్డ్‌‌ ఆర్టిస్ట్‌‌గా నటించిన నాకు ఇలా హీరోయిన్‌‌గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ‘కప్పేల’ అనే మలయాళ చిత్రానికి ఇది రీమేక్. నాకు ఎంతో నచ్చిన మూవీ రీమేక్‌‌లో చాన్స్ రావడంతో వెంటనే ఓకే చెప్పా. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు.

ఒరిజినల్ కంటే కూడా ఇది ఇంకాస్త కలర్‌‌‌‌ఫుల్‌‌గా ఉంటుంది. ఎక్కువ ఎమోషన్స్ ఉండడంతో పాటు నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ పోషించా. ఒరిజినల్‌‌లోని నటిని కాపీ కొట్టే ప్రయత్నం చేయకుండా ఆ పాత్రను అర్థం చేసుకొని నటించా. ఫస్ట్‌‌ టైమ్ హీరోయిన్‌‌గా నటిస్తుండటం, తెలుగు రాకపోవడంతో కొంత ప్రెజర్ ఉండేది. డైరెక్టర్‌‌‌‌తో పాటు టీమ్ అందరి సపోర్ట్‌‌ హెల్ప్ అయింది. మూవీ రిలీజ్‌‌కు ముందే తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’తో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తున్నా’ అని చెప్పింది.