
సుప్రీం కోర్టు విధించిన గడువు ముగియకుండానే ఆర్ కామ్ రూ. 458.77 కోట్ల బకాయిలను ఎరిక్సన్ కు చెల్లించింది. స్వీడిష్ టెలికం ఎక్విప్ మెంట్ కంపెనీకి బకాయిలను చెల్లించకపోతే, జైలు తప్పదని సు ప్రీం కోర్టు ఆర్ కామ్, ఆ కంపెనీ అధినేత అనిల్ అంబా నీలకు హెచ్చరిక జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగానే బకాయిలను చెల్లించడం లేదని ఆర్ కామ్‌ను సుప్రీం కోర్టు తప్పుపట్టింది . ఎరిక్సన్ మూడు సార్లు కోర్టు ధి క్కరణ కేసులను ఆర్ కామ్‌కు వ్యతిరేకంగా దా ఖలు చేసింది . దీంతో సుప్రీం కోర్టు ఈ కేసును సీ రియస్ గా పరిగణించింది. బకాయిలు చెల్లించకపోతే రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధిపతి అనిల్ అంబానీ మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని కిందటి నెలలోస్పష్టం చేసింది . ఎరిక్సన్ కు రూ. 458.77 కోట్ల చెల్లింపు జరిపినట్లు ఆర్ కామ్ వర్గాలు తెలిపాయి.ఇంతకు మిం చిన వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు.