పుడింగ్ పబ్ డ్రగ్స్ కేసులో విచారణ ముమ్మరం

పుడింగ్ పబ్ డ్రగ్స్ కేసులో విచారణ ముమ్మరం

బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.డ్రగ్స్ కేసులో నిందితులు అనిల్ కుమార్, అభిషేక్ లను చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని బంజారాహిల్స్ పీఎస్ లో విచారిస్తున్నారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు నిందితులను ఎంక్వైరీ చేయనున్నారు. అసలు పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి?  ఎక్కడ నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేశారు? ఎవరు తెచ్చారు? ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. నిందితులు ఇద్దరు ఇచ్చే సమాచారం మేరకు మరికొంత మందికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం

 

తెలంగాణ జడ్జిలను వేరే రాష్ట్రాలకు పంపొద్దు

131 కిలోల కేక్ కట్ చేసిన గైక్వాడ్