Mega157Glimpse: చిరు-అనిల్ మూవీకి టైటిల్ ఫిక్స్.. బర్త్డే గ్లింప్స్ అదుర్స్

Mega157Glimpse: చిరు-అనిల్ మూవీకి టైటిల్ ఫిక్స్.. బర్త్డే గ్లింప్స్ అదుర్స్

చిరంజీవి బర్త్‌‌డే అనగానే.. మెగా ఫ్యాన్స్‌‌కు ఆరోజు పండగ వాతావరణమే. ఇవాళ శుక్రవారం (ఆగస్ట్ 22న) ఆయన 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ‘విశ్వంభర’ నుంచి గ్లింప్స్‌‌ రిలీజ్ అయ్యి మెగా ఫ్యాన్స్కు మంచి ట్రీట్ ఇచ్చింది. 

ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న Mega 157 నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. “మన శంకరవరప్రసాద్ గారు” అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అనిల్ సిగ్నేచర్ స్టైల్‌కి, చిరు అల్టిమేట్ క్లాసికల్ స్వాగ్తో కుమ్మేశారు. అంతేకాకుండా 'పండుగకి వస్తున్నారు' అనే క్యాప్షన్తో అనిల్ మరోసారి రికార్డులు కొల్లగొట్టడం ఫిక్స్ అని చెప్పకనే చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. చిరుకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. చిరంజీవితో కలిసి నయనతార నటించడం ఇది మూడోసారి. సైరా నరసింహా రెడ్డి మూవీలో చిరుకు భార్యగా నటించగా.. ఆ తర్వాత గాడ్ ఫాదర్ (2022)లో సిస్టర్ క్యారెక్టర్ చేసింది. ఇపుడు మెగా 157 మూడోది కానుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే, మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలో సినిమాను సంక్రాంతి 2026కి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. పండుగ సీజన్‌కు ఉండే భారీ వసూళ్లను సాధించే దిశగా అనిల్ అడుగెలుస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న మూవీని, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.