RashmikaMandanna: రష్మిక ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌.. డిస్నీ ఏలియన్‌‌‌‌‌‌‌‌తో దోస్తీ.. ప్రమోషన్ మాములుగా లేదుగా

RashmikaMandanna: రష్మిక ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌.. డిస్నీ ఏలియన్‌‌‌‌‌‌‌‌తో దోస్తీ.. ప్రమోషన్ మాములుగా లేదుగా

యానిమల్, పుష్ప ఫ్రాంచైజీతో పాన్‌‌‌‌‌‌‌‌ ఇండియా స్థాయిలో మెప్పించిన రష్మిక మందన్న.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు వర్క్ చేస్తోంది. అలాగని ఏ అంతర్జాతీయ చిత్రంలోనూ ఆమె నటించడం లేదు కానీ వాల్ట్‌‌‌‌‌‌‌‌ డిస్నీ సంస్థ నిర్మించిన ఓ సినిమాను ఇండియాలో ప్రమోట్ చేస్తోంది.

‘లిలో అండ్ స్టిచ్‌‌‌‌‌‌‌‌’ అనే సైన్స్ ఫిక్షన్‌‌‌‌‌‌‌‌ కామెడీ డ్రామాను మన దేశంలో ఆమె ప్రచారం చేస్తోంది.  ఇందుకు సంబంధించి సోమవారం తన సోషల్ మీడియా హ్యాండిల్‌‌‌‌‌‌‌‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది రష్మిక. నా బెస్టీ స్టిచ్‌‌‌‌‌‌‌‌ తన పిచ్చితనంతో, అల్లరితో తనను అలరిస్తోందని చెప్పిన రష్మిక ఆ ఏలియన్‌‌‌‌‌‌‌‌ పాత్రతో ఆడుతూ కనిపించింది.

ఇప్పటికే ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదలైన ఈ మూవీ మే 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లిలో పెలేకాయ్ అనే హవాయి చిన్నారి తన తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క నాని దగ్గర పెరుగుతుంటుంది. ఒంటరితనం ఫీలయ్యే ఆ చిన్నారికి ఓ ఏలియన్‌‌‌‌‌‌‌‌ దగ్గరవుతుంది.

సైంటిస్టులు జన్యుపరంగా మార్పులు చేసిన ఆ ఏలియన్‌‌‌‌‌‌‌‌ను ఆమె స్టిచ్ అనే పేరు పెట్టి ఓ పెంపుడు కుక్కలా పెంచుతుంటుంది. తన చిత్రవిచిత్ర చేష్టలతో గందరగోళం సృష్టించే స్టిచ్‌‌‌‌‌‌‌‌ చేసిన అల్లరి ఎలాంటి చిక్కుల్లో పడేసిందనేది మిగతా కథ. 

2002లో ఇదే పేరుతో వచ్చిన యానిమేషన్‌‌‌‌‌‌‌‌ సినిమాకు ఇది రీమేక్.  లిలో పాత్రను మైయా కీలోహా పోషించింది.  డీన్ ఫ్లీషర్ క్యాంప్ దర్శకత్వం వహించారు. యానిమేషన్ వెర్షన్‌‌‌‌‌‌‌‌లో మెప్పించిన చిత్రం కావడంతో మన దేశంలోనూ అంచనాలు నెలకొన్నాయి. ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో..  టుడీ,  త్రీడీ ఫార్మట్స్‌‌‌‌‌‌‌‌లో విడుదలవుతోంది.