Mahavatar Narsimha OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘మహావతార్ నరసింహ’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్.. ప్లాట్ఫామ్ ఇదే

Mahavatar Narsimha OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘మహావతార్ నరసింహ’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్.. ప్లాట్ఫామ్ ఇదే

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కన్నడ యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహా’. ఈ యానిమేషన్ మూవీ థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో వసూళ్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ అందుకున్న విషయం తెలిసిందే. జులై 25న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం (సెప్టెంబర్ 18న) స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేశారు మేకర్స్‌‌‌‌‌‌‌‌. ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 19న) మధ్యాహ్నం 12.30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మహావతార్ నరసింహా స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌ కానుందని మేకర్స్ తెలియజేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి వస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

అశ్విన్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌ సమర్పణలో శిల్పా ధవాన్‌‌‌‌‌‌‌‌, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించారు. వారం పాటు నిలకడగా కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌ ఉండడమే గగనమై పోతున్న తరుణంలో, ఈ చిత్రం 200 థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.

మహా విష్ణువు నాలుగో అవతారమైన నరసింహుడి ఉగ్రరూపాన్ని ఈ సినిమాలో చూడొచ్చు. భక్త ప్రహ్లాదున్ని అతని తండ్రి, రాక్షసుడైన హిరణ్య కశిపుడి నుంచి కాపాడటానికి స్తంభాన్ని చీల్చుకొని వచ్చే నరసింహుడిని యానిమేషన్ రూపంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ సుమారు రూ.300 కోట్లకి పైగా వసూళ్లు చేసి సత్తా చాటింది.

ఇకపోతే, 'మహావతార్ నరసింహ' చిత్రానికి కొనసాగింపుగా, మహావతార్ పరశురామ్ వచ్చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు నవంబర్ 2025లో ప్రారంభం కానున్నాయి. 2027లో మహావతార్ పరశురామ్ రిలీజ్ కానుంది. ఆ ఆ తర్వాత 2029లో మహావతార్ రఘునందన్, 2031లో మహావతార్ ద్వారకాధీష్, 2033లో మహావతార్ గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 సినిమాలు రానున్నాయి.

యానిమేషన్ మూవీస్:

ఒకప్పుడు యానిమేషన్ మూవీస్.. తెలుగులో ఒకటి రెండు సినిమాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అవి పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. ఇపుడు అలా కాదు.. టెక్నాలజీ పెరిగింది. హీరోలు, హీరోయిన్‌లు అసలు అవసరం లేదు. పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ ఏ మాత్రం అవసరంలే. ఒక స్టార్ హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే తక్కువ బడ్జెట్ లోనే మంచి యానిమేషన్ తీసే రోజులొచ్చాయి.

మహావతార్ నరసింహ ఈ విషయాన్ని సరిగ్గా నిరూపించింది. ఈ యానిమేషన్ మూవీ కేవలం రూ.15 కోట్ల బడ్జెట్తో వచ్చి, బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకి పైగా గ్రాస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ వాయుపుత్రతో వస్తున్నారు. మైథాలజీ బ్యాక్ డ్రాప్లో యానిమేషన్ మూవీతో వస్తున్నట్లు ఇటీవలే పోస్టర్ సైతం రిలీజ్ చేశారు.

ఈ 3D యానిమేషన్‌ 2026 దసరా సందర్భంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం & కన్నడలో విడుదల కానుంది.  'కార్తికేయ2'తో భారీ విజయం సాధించిన చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు.