డ్రీమ్​ టు రియాలిటీ @ యానిమేషన్

డ్రీమ్​ టు రియాలిటీ @ యానిమేషన్

కర్నూల్‌‌  కొండారెడ్డి బురుజు​ హైదరాబాద్‌‌లో , బాహుబలి సినిమాలో మాహిష్మతి రాజ్యం., అమెరికాలో అనకాపల్లి..  అనకాపల్లిలో అమెరికాను సృష్టించడం, హీరోలతోనే కాదు ఈగతోనూ సినిమాలు చేయడం.. ఇలా ఊహాజనిత ప్రపంచాన్ని మన కళ్ల ముందుకు తెచ్చే టెక్నాలజీనే యానిమేషన్​. రోజు రోజుకూ ఎంటర్​టైన్​మెంట్​ రంగం అభివృద్ది చెందుతుండటంతో సాఫ్ట్​వేర్​ రంగానికి దీటుగా ఈ రంగం ఉద్యోగాలు కల్పిస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్​ను ఒక పిక్చర్​లో చూపించడం యానిమేషన్​ ప్రత్యేకత.

మనుషులను, బొమ్మలను కంప్యూటర్ సాఫ్ట్‌‌వేర్ సహాయంతో కదిలిస్తూ సినిమాలు, గేమ్స్​, యాడ్స్ వంటివి రూపొందించడమే యానిమేషన్​. చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన డిస్నీ, మిక్కీమౌస్, టామ్ అండ్ జెర్రీ, టార్జాన్​, పవర్​ రేంజర్స్​ వంటివన్నీ యానిమేషన్ కళ నుంచి పుట్టినవే.

యానిమేషన్‌‌ద్వారా ఒక ఊహాజనిత ఇమేజ్​కు ప్రాణం పోయాలంటే ఐడియా డెవలప్‌‌మెంట్‌‌, ప్రీ ప్రొడక్షన్‌‌, ప్రొడక్షన్‌‌, పోస్ట్‌‌ప్రొడక్షన్‌‌… వంటి స్టెప్​ బై స్టెప్​ ప్రాసెస్​ ఉంటుంది.  ఐడియా డెవలప్‌‌మెంట్‌‌లోనే పాత్రల రూపకల్పన చేసి ఐడియాస్‌‌ను లేఅవుట్స్‌‌గా మార్చుతారు. ఆ తర్వాత స్క్రిప్ట్‌‌రైటింగ్‌‌, స్టోరీ బోర్డింగ్‌‌, క్యారెక్టర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌, బ్యాక్‌‌గ్రౌండ్స్‌‌, లే అవుట్‌‌డిజైనింగ్‌‌, యానిమేటిక్స్‌‌ అండ్‌‌ వాయిస్‌‌ వంటి ప్రీ ప్రొడక్షన్‌‌ ప్రాసెస్​ ఉంటుంది. స్కానింగ్‌‌, కంపోజింగ్‌‌, బ్యాక్‌‌గ్రౌండ్‌‌ ప్రిపరేషన్‌‌, కలరింగ్‌‌ కంప్లీట్​ అయ్యాక సౌండ్‌‌ రికార్డింగ్స్‌‌, కలర్‌‌ ఎడిటింగ్‌‌, టెస్టింగ్‌‌, స్పెషల్‌‌ సౌండ్‌‌ ఎఫెక్ట్స్‌‌ వంటివి యాడ్‌‌ చేస్తారు. పోస్ట్‌‌ ప్రొడక్షన్‌‌స్టేజ్‌‌లో ఎడిటింగ్‌‌, స్పెషల్‌‌ఎఫెక్ట్స్‌‌, కలర్‌‌ కరెక్షన్‌‌, కంపోజింగ్‌‌, వాయిస్‌‌, మ్యూజిక్‌‌ ఎడిటింగ్‌‌ అండ్‌‌ రెండరింగ్‌‌వర్క్​ జరుగుతుంది. ఇవన్నీ సక్సెస్​ఫుల్​గా జరిగితేనే మనం అనుకున్న అవుట్​పుట్​ ఇమేజ్​ వస్తుంది. దీనికి ఏకాగ్రత, క్రియేటివిటీ, పేషన్సీ చాలా ముఖ్యం.

డిప్లొమా, డిగ్రీ కోర్సులు

దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రైవేట్‌‌ఇనిస్టిట్యూట్స్​ యానిమేషన్‌‌లో -పీజీ, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌‌కోర్సులు అందిస్తున్నాయి. వీటితో పాటు యానిమేషన్‌‌స్టైల్స్‌‌, టెక్నిక్స్‌‌కు సంబంధించి స్టాప్‌‌ మోషన్‌‌ యానిమేషన్‌‌, రాట్‌‌స్కోపింగ్‌‌, కంప్యూటర్‌‌ జనరేటెడ్‌‌3డీ, 2డీ యానిమేషన్‌‌, క్లే మోషన్‌‌, ఫొటోషాప్‌‌, మాయా, డ్రాయింగ్‌‌అంశాలపై ట్రైనింగ్​ ఇస్తున్నాయి. హైదరాబాద్​లోని దిల్​సుఖ్​ నగర్​, అమీర్​పేట్​లో ఉన్న  ప్రముఖ యానిమేషన్​ ఇన్​స్టిట్యూట్స్​ 6 నెలల డిప్లొమా, మూడేళ్ల బ్యాచిలర్స్​ డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి.

కోర్సు కరిక్యులమ్​

6 నెలల డిప్లొమా కోర్సులో మొదటి నెల ఫొటోషాప్​ సాఫ్ట్​వేర్​ యూజ్​ చేసి యానిమేషన్​ చేయడం నేర్పిస్తారు. తర్వాతి ఐదు నెలలు మాయా సాఫ్ట్​వేర్​ యూజ్​ చేసి యానిమేషన్​ చేయడంపై క్లాస్​ రూంతో పాటు సిస్టంపై ప్రాక్టికల్​ ట్రైనింగ్ ఉంటుంది. దీనిలో హిస్టరీ ఆఫ్ మల్టీమీడియా, డ్రాయింగ్, కలర్ థియరీ, కంప్యూటర్ బేసిక్స్, వీడియో అండ్ ఫిల్మ్ ఎడిటింగ్, కాన్సెప్ట్యువల్ ఆర్ట్, టెక్చరింగ్, , కంపోజిటింగ్, యాక్టింగ్ ఫర్ యానిమేటర్స్, క్యారెక్టర్ యానిమేషన్, ఫేషియల్ యానిమేషన్, మోడలింగ్​, లైటెనింగ్​, టెక్చరింగ్​ ఆఫ్ యానిమేషన్​,  రెండరింగ్​, డైనమిక్స్​పై ట్రైనింగ్​ ఉంటుంది. దీనిలో 70 శాతం పైగా ప్రాక్టికల్​గానే  ట్రైనింగ్ ఉంటుంది. తద్వారా విద్యార్థులు ఈజీగా నేర్చుకోగలరు. కోర్సు ఎండింగ్​లో ప్రాజెక్ట్ వర్క్​ ఉంటుంది. విద్యార్థులే స్వయంగా ఒక యానిమేషన్​ ప్రాజెక్టును చేయాల్సి ఉంటుంది. దీన్ని వారు సోషల్​ మీడియా ప్లాట్​ఫాంలలో షేర్​ చేయడం ద్వారా వారికి అవకాశాలు మెరుగవుతాయి.

యానిమేషన్​ రంగంలోకి రావాలనుకునేవారికి స్పెసిఫిక్​గా ఎటువంటి క్వాలిఫికేషన్​ అవసరం లేదు. పదోతరగతి పాస్​/ఫెయిల్​, ఇంటర్మీడియట్​ పాస్​/ఫెయిల్​ అయినవారు కూడా ఈ కోర్సులను నేర్చుకొని రాణించవచ్చు. యానిమేషన్‌‌లో డిప్లొమా, లేదా డిగ్రీ చేస్తే మంచి ప్యాకేజీతో జాబ్​ సొంతం చేసుకోవచ్చు.

రిక్వైర్డ్​ స్కిల్స్‌‌

యానిమేషన్‌‌లో రాణించాలనుకునే అభ్యర్థికి క్రియేటివిటీ, పేషన్సీ ముఖ్యం. . దాంతో పాటు స్కెచ్చింగ్‌‌పై ఆసక్తి, అవగాహన ఉంటే మంచిది. హార్డ్​వర్కింగ్​ నేచర్​, డిసిప్లేన్​, కమ్యూనికేషన్‌‌స్కిల్స్‌‌ అవసరం. కంప్యూటర్‌‌ డిజైన్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌, సోషల్​ నెట్​వర్కింగ్​పై నాలెడ్జ్​ ఉంటే మంచిది. వీటితో పాటు ఫొటోగ్రఫీ, లైటింగ్‌‌గురించి  తెలిసుండాలి.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్​లో జవహర్‌‌లాల్‌‌నెహ్రూ ఆర్కిటెక్చర్‌‌అండ్‌‌ఫైన్‌‌ఆర్ట్స్‌‌యూనివర్సిటీ నాలుగేళ్ల బ్యాచిలర్​ ఆఫ్ ఫైనార్ట్స్​ యానిమేషన్, ఉస్మానియా యూనివర్సిటీ మూడేళ్ల బీఎస్సీ ఇన్​ మల్టీమీడియా అండ్​ యానిమేషన్​​ కోర్సును అందిస్తోంది. దీనితో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్‌‌ఆఫ్‌‌ఫైన్‌‌ఆర్ట్స్‌‌లలో బ్యాచిలర్‌‌ఆఫ్‌‌ఫైన్‌‌ఆర్ట్స్‌‌పేరుతో డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు హైదరాబాద్​లోని అనేక ప్రైవేటు ఇనిస్టిట్యూట్స్​ బ్యాచిలర్స్​ డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్​ కోర్సులను అందిస్తున్నాయి.

కంపెనీస్​

గ్రీన్​ గోల్డ్​ యానిమేటర్స్,​ యువ యానిమేటర్స్,​ పిక్సల్లాయిడ్,​ ప్రైమ్​ ఫోకస్,​ సీజీ ట్రిక్స్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు ఎంటర్​టైన్​మెంట్​ రంగం అనగా సినిమాలు, సీరియల్స్​, షార్ట్ ఫిల్మ్​​, యాడ్​ ఏజెన్సీస్, యూట్యూబ్​ చానల్స్​, న్యూస్​ చానల్స్​​లో వీరి రిక్వైర్​మెంట్ ఎక్కువగా ఉంటుంది.

జాబ్​ డొమైన్స్​

కంపోజిటర్స్,  2డీ, 3డీ యానిమేటర్స్, బ్యాక్‌‌గ్రౌండ్ ఆర్టిస్ట్స్, ఆడియో అండ్ వీడియో ఎడిటర్స్, క్యారెక్టర్ యానిమేటర్స్, లే అవుట్ ఆర్టిస్ట్స్, మోడలింగ్​ ఆర్టిస్ట్​, లైటింగ్​ ఆర్టిస్ట్, టక్చరింగ్​ ఆర్టిస్ట్​, ఫ్రీలాన్సర్.

శాలరీస్​

సాఫ్ట్​వేర్​ రంగంతో పోటీపడుతూ కొలువులు సృష్టిస్తున్న ఈ రంగంలో ప్రొఫెషనల్స్​ కొరత ఉంది. రాబోయే మూడేళ్లలోనే ఈ రంగంలో లక్షకు పైగా నిపుణుల అవసరం ఉంటుందని అంచనా. ప్రభుత్వాలు యానిమేషన్​, గేమింగ్​ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడంతో అనేక స్టార్టప్స్​ పుట్టుకొస్తున్నాయి.  విదేశాల నుంచి అనేక కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి కొత్త కంపెనీలను నెలకొల్పుతున్నాయి. ఏ కంపెనీలో చేరినా వేతనం నెలకు కనీసం రూ.15వేలతో ప్రారంభమవుతుంది. మూడు నుంచి ఐదేళ్ల అనుభవంతో రూ.30వేల నుంచి రూ.40 వేలు సంపాదించవచ్చు. ఈ రంగంలో ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీకి  అప్​డేట్ అవ్వడం ముఖ్యం.​​ టాలెంట్ ఉన్న వాళ్లకు రూ.లక్షల్లో జీతాలు ఇచ్చే కంపెనీలూ ఉన్నాయి. – వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్

 

యూజ్ ఫుల్ వెబ్ సైట్స్
www.blueframesanimation.com
www.mmcanimation.com
www.pixxelarts.com
www.bestmultimedia.com
www. maacdilsukhnagar.com
www. pixelloid.com

ఇమేజ్ టవర్స్ తో కంపెనీల రాక
యానిమేషన్ రంగం క్రియేటివ్ ఫీల్డ్​. ప్రస్తుతం మనం చూసే ప్రతి సినిమాలో యానిమేషన్ ను వాడుతున్నారు. ఈ రంగంలో రాణించాలంటే
డిగ్రీలు పూర్తిచేయాల్సిన అవసరం లేదు. కేవలం పదో తరగతి, ఇంటర్మీడి యట్ విద్యార్హతతో రకరకాల యానిమేషన్ కోర్సులు అందుబాటులో
ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లాం టి దేశాల్లో ఇప్పటికే దీని హవా కొనసాగుతోంది. దీని ఇంపార్టెన్స్ దృష్ట్యా హైదరాబాద్​లో వెయ్యి కోట్ల పెట్టుబడితో ఇమేజ్‌ టవర్స్‌‌ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా యానిమేషన్‌‌, గేమింగ్‌ పరిశ్రమకు హైదరాబాద్​ ప్రధాన కేం ద్రం కాబోతోంది. నూతన కంపెనీల రాకతో రాబోయే రోజుల్లో లక్షలాది కొ లువులు ఏర్పడనున్నాయి. ఈ ఫీల్డ్​లో వర్క్ ను ఎంజాయ్ చేస్తూ డబ్బు  సంపాదించొచ్చు.
– సౌజన్య, మేనేజింగ్ పార్ట్ నర్ , బ్లూ ఫ్రేమ్స్ యానిమేషన్ ఇనిస్టిట్యూట్ , దిల్ సుఖ్ నగర్