
అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులను ఏకతాటిపై తీసుకొచ్చిన ఎవర్ గ్రీన్ ఫిల్మ్ మనం (MANAM). అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ మూవీ చాలా స్పెషల్. 2014 మే 23న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలై పదకొండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్కినేని హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఎమోషనల్ ట్వీట్ చేసింది.
" మనం యొక్క 11 అద్భుత సంవత్సరాలను జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండే సినిమా మనం. ANRLivesOn " అంటూ స్పెషల్ పోస్టర్ పంచుకుంది.
డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించిన మనం మూవీ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా మూడు తారలను హ్యాండిల్ చేసిన విధానం తెలుగు ప్రేక్షకులకు వీపరీతంగా నచ్చేసింది.
Celebrating 11 magical years of #Manam.
— Annapurna Studios (@AnnapurnaStdios) May 23, 2025
A film that always holds a special place in the hearts of everyone ❤️#Manam #ANRLivesOn #11YearsForClassicManam@iamnagarjuna @chay_akkineni @Vikram_K_Kumar @Samanthaprabhu2 @shriya1109 @AkhilAkkineni8 @anuprubens #PSVinod @PrawinPudi… pic.twitter.com/d8IKUeP1At
ఈ సినిమాకు హాస్యనటుడు హర్షవర్ధన్ ఇచ్చిన డైలాగ్స్, అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అయితే, గతేడాది (2024).. తెలుగు రాష్ట్రాలలో ‘మనం’ స్పెషల్ షోలని ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల ఈ సినిమాతో నెరవేరింది. ఇకపోతే, ఈ సినిమాతోనే చై, సమంత మధ్య ఉన్న లవ్ స్టోరీ బయటకొచ్చి పెళ్లిగా మారింది.
మనం’ మూవీ రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఆ టార్గెట్ ను ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ చేసింది. ఈ సినిమా ఫైనల్ గా రూ.36.65 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి.. డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా !