డిసెంబర్ 15న ఆలంబన రిలీజ్‌కు రెడీ

డిసెంబర్ 15న ఆలంబన రిలీజ్‌కు రెడీ

సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి కొడుకు వైభవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆలంబన’.  పార్వతి నాయర్ హీరోయిన్.  పారి కె విజయ్ దర్శకుడు.  కోటపాడి రాజేష్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది.

డిసెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  అపర కుబేరుల ఇంట్లో జన్మించిన హీరో..  దురదృష్టవశాత్తు వాళ్ళ కుటుంబం ఆస్తి అంతటినీ కోల్పోతాడు. అలాంటి పరిస్థితులో హీరో జీవితంలోకి జీని అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? తనకు ఎదురైన పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా కథ.