బీఆర్ఎస్ కు షాక్.. మరో ఉద్యమకారుడు రాజీనామా

బీఆర్ఎస్ కు షాక్.. మరో ఉద్యమకారుడు రాజీనామా

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట్ మండలంలో అధికార పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తూముకుంట మున్సిపాలిటీకి చెందిన చిరబోయిన రామచందర్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేశారు. మంత్రి మల్లారెడ్డి వైఖరితోనే తాను రాజీనమా చేస్తున్నట్లు ప్రకటించారు.  

మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు...

మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని చిరబోయిన రామచందర్ ఆరోపించారు. తన బంధు వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు తాను మంత్రి హరీష్ రావు శిష్యుడిగా ప్రజాసేవలో ముందున్నానని చెప్పారు. కానీ మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో పార్టీకి దూరమవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. మంత్రి మల్లారెడ్డి నియంతృత్వ పోకడలతో పార్టీకి నష్టం జరుగుతోందని..బీఆర్ఎస్ లో  ఉద్యమకారులకు గౌరవం లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

మంత్రి మల్లారెడ్డి పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను, పార్టీకి నష్టం కలిగించే వ్యక్తులను ప్రోత్సాహిస్తున్నారని తెలిపారు. ఉద్యమకారులకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. మల్లారెడ్డి ఎన్ని చేసినా ఇన్ని రోజులు భరించామని అన్నారు. ఎంత చెప్పినా పార్టీ అధిష్టానం కూడా సరిగా స్పందించడం లేదు కాబట్టే తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు రామచందర్ తెలిపారు.