మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ

మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ చేరింది. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ వీర విహారం చేశాడు. లంక బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించాడు.  ఫోర్లు, సిక్సర్లతో మైదానం నలుమూలల బంతిని తరలించాడు. 10 ఫోర్లు, ఒక సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు విరాట్ కోహ్లీ.  85 బంతుల్లో సెంచరీ మార్క్ ను చేరుకున్నాడు. వన్డేల్లే కోహ్లీకి ఇది 46వ సెంచరీ కాగా..ఓవరాల్ గా 74  సెంచరీలు పూర్తి చేశాడు. 

శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేల జయవర్దనే రికార్డ్ ను కోహ్లీ బ్రేక్ చేశాడు.  జయవర్దనే తన కెరీర్లో 448 అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడాడు. జయవర్దనే 33.4 యావరేజ్ తో 12,650 పరుగులు చేశాడు. అయితే, ఈ రికార్డ్ ను కోహ్లీ తిరగరాశాడు. ఇప్పటివరకు 266 వన్డే మ్యాచ్ లు ఆడిన విరాట్, 57.7 సగటుతో 12,584 పరుగులు చేశాడు.   సచిన్ స్వదేశంలో చేసిన 20 సెంచరీలను 160 మ్యాచ్ ల్లో పూర్తిచేస్తే, విరాట్ మాత్రం 101 మ్యచ్ ల్లోనే చేరుకున్నాడు.