మరో గుడ్‌ న్యూస్‌: వంట నూనెలపై పన్ను తగ్గింపు

మరో గుడ్‌ న్యూస్‌: వంట నూనెలపై పన్ను తగ్గింపు

దీపావళికి ముందు రోజు పెట్రో పన్నులు తగ్గిస్తూ ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరో శుభవార్త చెప్పింది. వంట నూనెలపై భారం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పామాయిల్‌, సోయాబీన్, సన్‌ఫ్లవర్, వేరు శనగ నూనెలకు సంబంధించిన క్రూడ్‌ అయిల్‌, రిఫైన్డ్‌ ఆయిల్‌పై పన్ను తగ్గించింది. దీంతో ఆయా వంట నూనెలు లీటర్‌‌కు రూ.4 నుంచి రూ.7 వరకూ రేట్లు తగ్గుతున్నాయి.

గత ఏడాది నుంచి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వంట నూనెల క్రూడ్‌ (క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్)పై బేసిక్ డ్యూటీని 2.5 శాతం నుంచి జీరోకు తగ్గించేసినట్లు కేంద్ర పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే  క్రూడ్‌ పామాయిల్‌పై 20 శాతం ఉన్న అగ్రిసెస్‌ను 7.5 శాతానికి, క్రూడ్ సోయాబీన్‌ ఆయిల్‌పై 5 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. అలాగే రిఫైన్డ్‌ పాయాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్‌‌ ఆయిల్‌పై 32.5 శాతం ఉన్న బేసిక్‌ డ్యూటీ టాక్స్‌ను 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించినట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం..

పెట్రో రేట్లు మరింత తగ్గించాలె: కాంగ్రెస్ డిమాండ్

కశ్మీర్‌‌లో మెడికల్ కాలేజీ ఆస్పత్రిపై ఉగ్ర దాడి

ఆరేళ్ల చిన్నారిపై రేప్‌.. నిందితుడిని కఠినంగా శిక్షించాలి