Reliance JioBook 2023 : జియో ల్యాప్ టాప్ రూ.16 వేలు మాత్రమే.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే...

Reliance JioBook 2023 : జియో ల్యాప్ టాప్ రూ.16 వేలు మాత్రమే.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే...

రిలయన్స్ జియో (Jio) నుంచి మరో ల్యాప్​టాప్​ భారతదేశం మార్కెట్​లోకి విడుదలైంది. 'రిలయన్స్​ జియో బుక్'​ పేరుతో దీనిని సోమవారం (జులై 31)న విడుదల చేశారు. గత ఏడాది అక్టోబరులో విడుదల చేసిన 'జియో బుక్'​ ల్యాప్​టాప్​కు కొనసాగింపుగా దీనిని తీసుకొచ్చారు. ఫస్ట్​ వెర్షన్​తో పోలిస్తే దీని డిజైన్​, పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.  లేటెస్ట్​ అప్​డేట్​లకు అనుగుణంగా ఈ ల్యాప్ టాప్ ను రూపొందించారు. ఫస్ట్​ వెర్షన్​ ల్యాప్​టాప్​తో పోలిస్తే దీనిని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. కొత్తగా తెచ్చిన రిలయన్స్​ జియో బుక్​లోని బ్యాటరీ లైఫ్​ కూడా మెరుగ్గా ఉంటుందంటున్నారు. ఈ ప్రొడక్ట్​ విక్రయాలను ఈ-కామర్స్​ ఫ్లాట్​ఫాం అమెజన్​లోనూ అందుబాటులో ఉంచారు. ఇటీవలే అమెజాన్​ వెబ్​సైట్​లో కొత్త జియోబుక్​ టీజర్​ను​ విడుదల చేశారు.  

ఫీచర్లు ఇవే.. 

* ఈ ల్యాప్‌టాప్‌లో 11.6 -అంగుళాల యాంటీ గ్లేర్ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. జియో ఓఎస్‌, మీడియాటెక్‌ MT 8788 ఆక్టాకోర్ 64-బిట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 

* 4 జీబీ LPDDR4 ర్యామ్‌/64 జీబీ ఫ్లాష్‌ మెమొరీ ఉంది.  మెమొరీని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. వీడియో కాలింగ్ కోసం 2ఎంపీ హెచ్‌డీ హెచ్‌ కెమెరా ఇస్తున్నారు. ARM Mali G72 గ్రాఫిక్‌ కార్డ్ అమర్చారు. 

* 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎనిమిది గంటలకు పైగా పనిచేస్తుందని జియో చెబుతోంది. వైఫై కనెక్టివిటీతోపాటు, 4జీ సిమ్‌ను సపోర్ట్ చేస్తుంది.

* ఈ ల్యాప్​టాప్​ను​ మంచి కాంపాక్ట్​ డిజైన్​తో పాటు 4జీ ఇంటర్నెట్ యాక్సెస్ ​కనెక్టివిటీతో తీసుకొచ్చారు. ఇందులో పవర్​ఫుల్​ఆక్టా-కోర్​ప్రాసెసర్​కూడా ఉంది. అందువల్ల దీనిలో హై-డెఫినిషన్​ వీడియో స్ట్రీమింగ్​చేసుకోవచ్చు. 

* వివిధ సాఫ్ట్​వేర్​లను ఉపయోగించి, మల్టీటాస్కింగ్​ కూడా చేయవచ్చు.

* ఇక ఫుల్ డే బ్యాటరీ లైఫ్​ ఈ ల్యాప్​టాప్ ప్రత్యేకత. ప్రస్తుతం దీనిని బ్లూ, గ్రే కలర్స్​లో మార్కెట్ లోకి విడుదల చేశారు. 

* జియో ఆపరేటింగ్​ సిస్టమ్​తో ఇది పని చేయనుంది. దీనిలో జియోమీట్, జియోక్లౌడ్, జియో సెక్యూరిటీ లాంటి ఇన్​బిల్ట్​యాప్స్​కూడా అందించారు.

* జియో బుక్​ ఫస్ట్​ వెర్షన్​ బరువు 1.20 కేజీలు .. సెకండ్​ వెర్షన్​ను 990 గ్రాముల బరువుతో తీసుకొచ్చారు.

* ఈ జియోబుక్​ అన్ని వయస్సుల వారికి అనుగుణంగా ఉంటుందని.. ఎంటర్​టైన్మెంట్​, ప్రొడక్టివిటీ, గేమింగ్​లను సపోర్ట్​ చేస్తుందని రిలయన్స్​ జియో తెలిపింది. 

* ఇక ఈ రిలయన్స్​ జియో బుక్​ పనితీరుకు సంబంధించి పూర్తి రివ్యూ త్వరలోనే రానుంది. దీనిని కేవలం రూ.20 వేలకే అందిస్తుంది రిలయన్స్. మొదటి వెర్షన్​ ల్యాప్​టాప్​ ధర రూ.16,000కు తగ్గించింది.

https://twitter.com/reliancejio/status/1685984150677749761