కేరళలో సురేశ్ గోపితో బీజేపీ ఎంట్రీ

కేరళలో సురేశ్ గోపితో  బీజేపీ ఎంట్రీ

న్యూఢిల్లీ: కేరళలోని త్రిస్సూర్ లోక్​సభ సెగ్మెంట్ నుంచి గెలిచిన సినీ నటుడు, పొలిటీషియన్ సురేశ్ గోపి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఫోన్ రావడంతోనే ఫ్యామిలీతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. కేరళలో బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తే.. కేవలం త్రిస్సూర్​లో మాత్రమే విజయం సాధించి ఆ రాష్ట్రంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. పార్టీ బలోపేతానికి సురేశ్ గోపి ఎంతో కృషి చేశారు. 

కేర‌ళ రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్​లో అడుగు పెట్టబోతున్న వ్యక్తిగా రికార్డులోకెక్కాడు. 2016లో ఫ‌స్ట్ టైం రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయిన సురేష్ గోపి.. ఆ త‌ర్వాత బీజేపీలో చేరి 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2021లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. ముచ్చటగా మూడోసారి త్రిస్సూర్ నుంచి విజ‌యం సాధించి కేరళలో బీజేపీ ఖాతా తెరిచాడు. 1952 నుంచి మొత్తంగా 18 సార్లు లోక్​సభ ఎన్నికలు జరిగితే.. జన్​సంఘ్, జనతా పార్టీ, బీజేపీ నుంచి కేరళలో ఎవరూ గెల్వలేదు. ఫ‌స్ట్ టైం సురేశ్ గోపి ఆ ఘ‌న‌త సాధించాడు.