కేరళలో 5 మంకీపాక్స్ కేసులు

కేరళలో 5 మంకీపాక్స్ కేసులు

భారతదేశంలో కరోనాతో పాటు మంకీపాక్స్ కలకలం రేపుతోంది. పలు కేసులు నమోదవుతున్నాయి. కేరళలో మరో మంకీపాక్స్ కేసు బయటపడింది. మలప్పురానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. జూలై 27న UAE నుంచి కోజికోడ్ ఎయిర్ పోర్టుకి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు కేరళలో 5 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు రాష్ట్రమంత్రి వీణా జార్జ్ తెలిపారు వ్యక్తులకు ట్రీట్మెంట్ అందిస్తున్నామని.. ఎప్పటికప్పుడు రోగుల ఆరోగ్యపరిస్థితి తెలుసుకుంటున్నామన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ LNJP హాస్పిటల్ నుంచి మంకీపాక్స్ నుంచి కోలుకున్న వ్యక్తి డిశ్చార్జ్ అయ్యాడు. 25 రోజుల్లోనే మంకీపాక్స్ నుంచి వ్యక్తి కోలుకున్నట్లు హాస్పిటల్ ఎండీ సురేశ్ కుమార్ తెలిపారు. ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. ఢిల్లీలో తొలి మంకీపాక్స్ కేసుగా గుర్తించారు. జ్వరం, దద్దుర్లు ఇతర లక్షణాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఐసోలేషన్ లో ఉంచి వ్యక్తికి ట్రీట్మెంట్ అందించినట్లు తెలిపారు. మరోవైపు ఇంకో మంకీపాక్స్ కేసు ఉందని.. మరో ఇద్దరికి లక్షణాలున్నాయని డాక్టర్ సురేశ్ కుమార్ పేర్కొన్నారు. 

మరోవైపు...
దేశంలో కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 13 వేల 737 మందికి వైరస్ సోకగా.. మరో 34 మంది చనిపోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గగా.. మరణాలు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 17 వేల 897 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం లక్షా 39 వేల 792 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 204.6 కోట్లకు పైగా టీకా డోసులను కేంద్రం పంపిణీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల 21 వేల 965 కొత్త కేసులు రాగా... వెయ్యి 259 మంది మరణించారు.  జపాన్ లో లక్షకు పైగా కేసులు రాగా.. 78 మంది చనిపోయారు. అమెరికాలో కొత్తగా 54 వేలకు పైగా కేసులు రాగా.. 149 మంది ప్రాణాలు కోల్పోయారు.