ముక్కు, గొంతులోనే కరోనా వైరస్​ అంతం

 ముక్కు, గొంతులోనే కరోనా వైరస్​ అంతం

 

  • మార్కెట్​లోకి గ్లెన్​మార్క్​ 
  • నైట్రిక్​ ఆక్సైడ్​ నాసల్​ స్ప్రే
  • ‘ఫాబి స్ప్రే’ పేరిట మార్కెట్​ చేస్తామన్న కంపెనీ
  •   ఒకే రోజులో వైరల్​ లోడ్​
  •  94% తగ్గుతుందని వెల్లడి
  •     పేషెంట్లకు ఎలాంటి సైడ్​ఎఫెక్ట్స్​ రావని ప్రకటన

న్యూఢిల్లీ: కరోనా ట్రీట్​మెంట్​కు మరో కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. వైరస్​ను ఒక్కరోజులోనే ఖతం చేసే నైట్రిక్​ ఆక్సైడ్​ నాసల్​ స్ప్రేను గ్లెన్​మార్క్​ ఫార్మా బుధవారం మార్కెట్​లోకి విడుదల చేసింది. కెనడాకు చెందిన శానోటైజ్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​​ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన ఈ నాసల్​ స్ప్రేని.. ‘ఫాబిస్ప్రే’ పేరిట మార్కెట్​ చేయనున్నట్టు గ్లెన్​మార్క్​ ప్రకటించింది. అయితే, మందు ధర ఎంతన్నది మాత్రం సంస్థ ప్రకటించలేదు. 

ఒక్కరోజులోనే ఖతం

కరోనా మందులకు స్పీడ్​గా అనుమతులివ్వడంలో భాగంగా ఈ నాసల్​ స్ప్రేకి డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా మార్కెటింగ్​ అనుమతులిచ్చింది.

 ముక్కు, గొంతులోనే వైరస్​ అంతం

ఇండియాలో ఫేజ్​ 3 ట్రయల్స్​ చేశామని, ఒక్క రోజులో 94 శాతం, రెండు రోజుల్లో 99 శాతం మేర కరోనా వైరస్​ను మందు చంపేసిందని కంపెనీ ప్రకటించింది. నైట్రిక్​ ఆక్సైడ్​కు మంచి యాంటీ మైక్రోబియల్​, యాంటీ వైరల్​ గుణాలున్నాయని, దాని వల్ల ఎలాంటి సైడ్​ఎఫెక్ట్స్​ రావని చెప్పింది. కరోనా పేషెంట్లకు ఈ నాసల్​ స్ప్రే సురక్షితమైనదని తెలిపింది. ముక్కులోపల మందును స్ప్రే చేయడం ద్వారా ముక్కు, గొంతులోనే వైరస్​ను చంపేసి.. లంగ్స్​లోకి వైరస్​ వెళ్లకుండా అడ్డుకుంటుందని పేర్కొంది. ఈ మందుతో కరోనా పేషెంట్లకు టైంకు మంచి కరోనా ట్రీట్​మెంట్​ అందుతుందన్న నమ్మకం ఉందని గ్లెన్​మార్క్​ చీఫ్​ కమర్షియల్​ ఆఫీసర్​ రాబర్ట్​ క్రాకర్ట్​ చెప్పారు. ఇండియా కరోనా ఫైట్​లో తామూ భాగమైనందుకు, తమ మందుకు అనుమతులు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. కాగా, ఫాబిస్ప్రే నాసల్​ స్ప్రేకి ఎమర్జెన్సీ అనుమతులు ఇవ్వాల్సిందిగా నిరుడు జులైలోనే సీడీఎస్​సీవోకు గ్లెన్​మార్క్​ అప్లై చేసింది. 99.9 శాతం కరోనా వైరల్​లోడ్​ను కేవలం రెండు నిమిషాల్లోనే ఈ మందు తుడిచిపెట్టేసినట్టు అమెరికాలోని యూటా స్టేట్​ యూనివర్సిటీ స్టడీలో తేలిందని గ్లెన్​మార్క్​ సీనియర్​ వీపీ, క్లినికల్​ డెవలప్​మెంట్​ హెడ్​ డాక్టర్​ మోనికా టాండన్​ చెప్పారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్​ వంటి వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొంటుందన్నారు.