కరోనా ఎఫెక్ట్ ను తగ్గించేందుకు మరో ప్యాకేజీ రెడీ?

కరోనా ఎఫెక్ట్ ను తగ్గించేందుకు మరో ప్యాకేజీ రెడీ?

ఆర్థిక వ్యవస పై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు మరొక స్టిమ్యులస్‌ ప్యాకేజిని ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ ప్యాకేజిని సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఫైనాన్స్‌ మినిస్ట్రీ సెక్రటరీలు, స్టాఫ్‌, పీఎంఓలో సీనియర్‌ అధికారులు గత వారం రోజుల నుంచి చర్చలు జరుపుతున్నా రు. ఆర్థిక వ్యవస్థ పై కరోనా ప్రభావం తగ్గించడానికి, ఆర్థిక మాంద్యం రాకుండా చూడడానికి వీలుగా రెండో స్టిమ్యులస్‌ ప్యాకేజి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవస్థ పై చర్చించేందుకు ఫైనాన్స్‌ మినిస్ట్రీ, పీఎంఓ అధికారులు తరుచుగా కలుస్తున్నారని పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశంలో21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇది ఏప్రిల్‌ 14తో ముగియనుంది. కాగా లాక్‌డౌన్‌ వలన ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని నిపుణులు అంటున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరానికి గానూ రెవెన్యూ, ఖర్చులను ప్రభుత్వం జాగ్రత్తగా లెక్కించే అవసరముంది. లాక్‌డౌన్‌ వలన దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్‌, సర్వీసెస్‌ సెక్టార్ లు తాత్కాలికంగా మూతపడ్డాయి. విమానాలు తిరగడం లేదు. ప్యాసెంజర్‌ రైళ్లన్నీ నిలిచిపోయాయి. స్టీల్‌, సిమెంట్‌, ఆటోమొబైల్‌ కంపెనీల ప్రొడక్షన్‌ నిలిచిపోయింది. హోటల్స్‌, రెస్టారెంట్స్‌ మూతపడ్డాయి. నడుస్తున్న కంపెనీలు (ఉదా. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు) కూడా పూర్తిసామర్ధ్యంతో పని చేయడం లేదు. మూడు వారాల పాటు పరిశ్రమలు షట్‌డౌన్‌లో ఉండడంతో లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత కూడా సాధారణ స్థితికి చేరడానికి మరికొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో ప్రభుత్వం ఆదాయం భారీగా తగ్గనుందని విశ్లేషకులు అన్నారు. వీటికి తోడు ప్రభుత్వం రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజిని ఇప్పటికే ప్రకటించిందని, ప్రభుత్వ ఖజానాపై ఇది భారంగా మారనుందని తెలిపారు. రెండో స్టిమ్యులస్‌ ప్యాకేజిని ప్రభుత్వం ప్రకటించే ముందు వీటిని పరిగణలోకి తీసుకుంటుందన్నారు.

డిజిన్వెస్ట్ మెంట్  ఉంటుందా?

కరోనా వలన ఇండియాలో, గ్లోబల్‌గా క్యాపిటల్‌ మార్కెట్లు భారీగా నష్టపోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి టైమ్‌లో ప్రభుత్వం ఆర్థిక  ఆర్ధిక సంవత్సరం 2020–21 లో లక్ష్యంగా పెట్టుకున్న డిజిన్వెస్ట్‌‌ మెంట్‌ ప్రక్రియ అంత సులువుగా పూర్తవ్వకపోవచ్చని నిపుణులంటున్నారు. డిజిన్వెస్ట్‌ మెంట్‌ ద్వారా రూ. 2.1 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిజిన్వెస్ట్‌‌ మెంట్‌ పక్రియ లో ముఖ్యంగా ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలి యంలోని వాటాను విక్రయించడం ద్వారా మెజార్టీ నిధులను సేకరించాలనుకుంది. కానీ ప్రస్తుత పరి స్థితులలో గ్లోబల్‌గా ఎయిర్‌లైన్‌ కంపెనీలు తాత్కా లికంగా మూత పడ్డాయి. ఆయిల్‌ ధరలు భారీగా పడడంతో భారత్ పెట్రోలియం నష్టపోతోంది. అందువలన ప్రస్తుత పరిస్థితులలో డిజిన్వెస్ట్‌‌ మెంట్‌ సులువుగా జరగకపోవచ్చనినిపుణులు తెలిపారు. దీని ప్రభావాన్ని, ద్రవ్యలోటును ప్యాకేజి ప్రకటించే ముందు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో ద్రవ్యలోటు దేశ జీడీపీలో 3.5 శాతం లోపు ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు కూడా గ్లోబల్‌ మా ర్కెట్లతో పాటు భారీగా పడుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి గమనిస్తే మార్కెట్లు 30 శాతానికి పైగా నష్టపోయాయి.

రూ. 1.2 లక్షల కోట్ల తో ప్యాకేజి అవసరం

దేశంలోని అన్ని సెక్టార్లు తిరిగి పుంజుకోవడానికి ప్రభుత్వం రూ. 1–1.2 లక్షల కోట్ల ప్యాకేజినిప్ర కటించాలని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ అన్నా రు. గ్లోబల్‌గా ఆయిల్‌ ధరలు పడిపోవడంతో ఇండియాకు సుమారుగా 50 బిలియన్‌ డాలర వరకు ఫ్యూయల్ బిల్ ఆదా అవుతుందని చెప్పారు. దీంతో పాటు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సలహాయిచ్చా రు. వ్యవస్థలో క్యాష్‌ ఫ్లోను సరియైన స్థాయిలో ఉంచేందుకు ప్రభుత్వానికి అప్పులు తీసుకోవడం అవసరమని అన్నారు. దీనికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అడ్డుపడుతుందని చెప్పారు. ఒకటి లేదా రెండేళ్ల వరకు ద్రవ్యోల్బణాన్ని మానిటర్‌ చేయడాన్ని ప్రభుత్వం నిలిపివేయాలన్నారు. దీంతో వ్యవస్థలో లిక్విడిటీని బ్యాలెన్స్‌ చేయడం, చెక్‌ చేస్తుండడం వంటివి తప్పుతాయని చెప్పారు. వీటితో పాటు బాసెల్‌ నిబంధనలను అధికారికంగా నిలిపివేయాలని, దీంతో బ్యాంక్‌ లోన్లను రీస్ట్రక్చర్‌ చేయడానికి వీలుంటుందని దీపక్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ వలన వ్యవస్థలో ఫైనాన్షియల్ ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఇది బ్యాంకుల ఎన్‌పీఏలు పెరగడానికి కారణమవుతుందని, అందరిని ఇన్‌‌సాల్వెన్సీ చట్టం కింద తీసుకు రావడం కుదరదని అన్నారు. బ్యాంకుల ఎన్‌పీ ఏలు అమాంతం పెరగకుండా ఉండేందుకు, ఎకానమీ తిరిగి గాడిలో పడేంత వరకు బాసెల్‌ నిబంధనలను నిలిపివేయాలన్నారు. రెపో రేటును 75 బేసిస్‌ పాయింట్లు వరకు ఆర్‌బీఐ తగించినప్పటికీ, రివర్స్‌ రెపోరేటుకు 90 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. దీంతో బ్యాంకులు ఆర్‌బీఐ దగ్గర డిపాజిట్‌ చేయడం కంటే ఒత్తిడిలో ఉన్న సెక్టార్లకైనా అప్పులివ్వడానికి సిద్ధ మవుతున్నాయని ఇది ఎన్‌పీఏలు పెరగడానికి కారణమవుతుందని దీపక్‌ చెప్పారు.

జాబ్‌ లాస్‌‌ ఉంటుంది

కరోనా ఔట్‌బ్రేక్, నేషనల్‌ లాక్‌ డౌన్‌ వలన దేశ ఎకానమీ తీవ్రంగా నష్టపోతోందని సీఐఐ సీఈఓ పోల్‌ పేర్కొంది. వీటి వలన కంపెనీల ఆదాయాలు పడిపోతాయని, జాబ్‌ లాస్‌ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ పోల్‌లో వివిధ సెక్టార్లకు చెందిన 200 సీఈఓలు పాల్గొన్నా రు. ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్ లో కంపెనీల రెవెన్యూ 10 శాతం మేర, ప్రాఫిట్స్‌ 5 శాతం మేర తగ్గుతాయని ఈ పేర్కొంది. మొత్తంగా జాబ్‌లాస్‌ ఉంటుందని 52 శాతం కంపెనీలు తెలిపాయని తెలిపింది. 15 శాతం జాబ్‌లాస్‌ ఉంటుందని 47 శాతం కంపెనీలు పేర్కొనగా, 15–30 శాతం వరకు జాబ్‌లాస్‌ ఉంటుందని 32 శాతం కంపెనీలు తెలిపాయని ఈ సర్వే పేర్కొంది.