
న్యూఢిల్లీ: అదానీ ఇష్యూపై సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలైంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ లీడర్ జయ ఠాకూర్ కోరారు. ఈ పిల్ ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఓకే చెప్పింది. ఈ నెల 24న విచారణ చేపడతామని మొదట చెప్పింది. అయితే ఇదే ఇష్యూపై దాఖలైన రెండు పిల్స్ పై ఈ నెల 17న విచారణ జరగనుందని, వాటితో కలిపి విచారించాలని జయ ఠాకూర్ తరఫు లాయర్ కోరారు. దీంతో అదే రోజున విచారణ చేపడతామని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది.