శీకాకాయతో జుట్టుకు ఎన్నో లాభాలు

 శీకాకాయతో జుట్టుకు ఎన్నో లాభాలు

శీకాకాయలో ఉండే యాంటీ ఆక్సి డెంట్స్‌‌, విటమిన్‌‌ -ఎ, సి, డి, కె హెయిర్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌ రాకుండా చేస్తాయి.  వీటితో ఇంకా బోలెడు లాభాలు ఉన్నాయి.  శీకాకాయలో ఉన్న యాంటీ ఫంగల్‌‌ లక్షణాలు చుండ్రు, డెడ్‌‌ స్కిన్‌‌ సెల్స్‌‌ను దూరంచేస్తాయి. వాటివల్ల కలిగే డ్రైనెస్‌‌, చికాకులను పోగొడతాయి.  జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది. అందుకు శీకాకాయలో ఉన్న ఆల్కలాయిడ్స్‌‌ సాయపడతాయి. ఇది స్కాల్ప్‌‌లో ఉన్న పిహెచ్‌‌ను కంట్రోల్‌‌ చేస్తుంది. దురద, చికాకులను పోగొడుతుంది. జుట్టు తొందరగా నెరిసిపోనివ్వదు.  ఇందులోని ఆస్ట్రింజెంట్‌‌ గుణం జుట్టుకు అంటుకున్న చెమట, మురికిని పోగొట్టి మృదువుగా, మెరిసిపోయేలా చేస్తుంది. శీకాకాయ లాభాలు పొందాలంటే ఇంట్లోనే హెయిర్‌‌‌‌ప్యాక్స్‌‌ తయారుచేయొచ్చు..  గిన్నెలో మూడు టేబుల్‌‌ స్పూన్‌‌ల శీకాకాయ్‌‌ పొడి, రెండు టేబుల్‌‌ స్పూన్‌‌ల పెరుగు వేసి కలపాలి. రెండోది నెయ్యి, ఆమ్లా, శీకాకాయ పొడులన్నీ ఒక్కో టేబుల్‌‌ స్పూన్‌‌ తీసుకొని గిన్నెలో కలపాలి.  ఈ రెండు ప్యాక్‌‌ల్లో ఏదైనా వారానికి ఒకసారి జుట్టుకు రాసుకొని అరగంట ఉంచి మామూలు నీళ్లతో స్నానం చేయాలి.