సూపర్ హీరోకి లోకల్ టచ్

సూపర్ హీరోకి లోకల్ టచ్

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్, హనుమాన్ చాలీసా పాటతో ఆకట్టుకున్న టీమ్, బాలల దినోత్సవం సందర్భంగా రెండో పాటను విడుదల చేశారు. ‘చికిచ చికిచ చమ్ చమ్.. చికిచా చికిచా, అడుగో అడుగో చూడు ఎవరీ చిచ్చా.. సూపర్ హీరోకి కొంచెం లోకల్ టచ్ ఆ..’ అంటూ సాగిన ఈ పాటను అనుదీప్ దేవ్ కంపోజ్ చేయగా, వాగ్దేవి, ప్రకృతి, మయూఖ్ పాడారు. 

‘సరిపోడంట సూపర్ మ్యాన్.. భయపడిపోడా బ్యాట్ మ్యాన్.. హిప్ హిప్ అనడా హీ మ్యాన్.. ఎత్తేస్తారు ఎక్స్‌‌ మ్యాన్.. వచ్చాడు కొత్త సూపర్ హీరో.. మన హనుమాన్ ముందర అందరు జీరో’ అంటూ కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. అమృత అయ్యర్ హీరోయిన్‌‌గా, వినయ్ రాయ్ విలన్‌‌గా, వరలక్ష్మీ శరత్‌‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జనవరి 12న సినిమా విడుదల కానుంది.