ఇదో విచిత్రమైన కేసు: ఆ మాత్రం తెలివి కూడా లేదా.. ఎందుకు పనికొస్తార్రా మీరు..!

ఇదో విచిత్రమైన కేసు: ఆ మాత్రం తెలివి కూడా లేదా.. ఎందుకు పనికొస్తార్రా మీరు..!

ఏదైనా దొంగ పని చేసినా.. ఏదైనా వెధవ పని చేసినా వాడ్ని తిడతారు.. కొడతారు.. ఈ వార్త తర్వాత ఆ దొంగలను తిడుతున్నారు నెటిజన్లు.. కాకపోతే విచిత్రంగా.. వెరైటీగా తిడుతున్నారు.. అవును విచిత్రమైన కేసు ఇది.. మన దేశంలోనే.. మన గుజరాత్ రాష్ట్రంలోనే జరిగిన ఈ కేసు వివరాలు.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటో చూద్దామా..

గుజరాత్ రాష్ట్రంలో ఒక కోటి 60 లక్షల రూపాయల విలువైన.. నకిలీ 500 రూపాయల నోట్లు పట్టుబడ్డాయి. పట్టుబడిన నకిలీ నోట్లను చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు.. ఎందుకంటారా.. 

>>> 500 నోట్లపై గాంధీ ఫొటో ఉంటుంది.. వీళ్లు నటుడు అనుపమ్ కేర్ ఫొటో పెట్టారు.
>>> రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాలి కదా.. వీళ్లు Resole Bank Of India అని రాశారు..
>>> నోట్ల కట్టలపై బ్యాంక్ సీల్ ఉంటుంది కదా.. SBI ప్లేస్ లో.. Start Bank Of  India అని రాశారు..

మన 500 నోట్లపై ఎవరి బొమ్మ ఉంటుందో కూడా వీళ్లకు తెలియదు..
కనీసంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే స్పెల్లింగ్ కూడా తెలియదు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఏకంగా స్టార్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నారు..

Also Read :- సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?

 

కనీసం చేసే వెధవ పనికి అయినా బ్రెయిన్ ఉండాలి కదా.. మినిమం అంటే మినిమం బుర్ర ఉండాలి కదా.. ఏదో ఒకటీ అరా నోట్లా అంటే.. ఏకంగా కోటి 60 లక్షల రూపాయల విలువైన 500 నకిలీ నోట్లు ప్రింట్ చేశారు.. అంటే వీళ్లకు అసలు నోటు ఎలా ఉంటుందో కూడా తెలియదా.. గాంధీకి.. అనుపమ్ కేర్‎కు కూడా తేడా తెలియదా.. అసలు గాంధీ ఎలా ఉంటాడో కూడా తెలియదా.. అంతేనా.. వీళ్లు దేనికి పనికొస్తారు.. ఎందుకు పనికొస్తారు.. భారతదేశంలో ఇలాంటి యువకులు ఉన్నారా.. ఇలాంటోళ్లు ఉన్నారా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. అసలు కంటే నకిలీ తయారు చేయటానికే ఎక్కువ తెలివి కావాలి.. అలాంటిది ఇలాంటి తెలివి తక్కువ వాళ్లు దేనికి పనికొస్తారు.. భవిష్యత్ లో ఇండియా ఎలా ఉంటుందో వీళ్లను చూసి ఊహించుకోండి అంటూ నెటిజన్లు తమ తమ స్టయిల్ లో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు..