Anupama Parameswaran: రోజూ అన్నమే తినలేం కదా.. బోల్డ్ ప్రశ్నకు.. అనుపమ బోల్డ్ ఆన్సర్

Anupama Parameswaran: రోజూ అన్నమే తినలేం కదా.. బోల్డ్ ప్రశ్నకు.. అనుపమ బోల్డ్ ఆన్సర్

అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran).. ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. ప్రేమమ్(Premam) సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ మళయాళ బ్యూటీ.. ఆ తరువాత వచ్చిన అఆ(A.AA) సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అక్కడినుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు అనుపమా. వరుసగా క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు అందుకొని స్టార్ బ్యూటీల లిస్టులో చేరిపోయింది. అయితే ఆ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్న అనుపమా.. తరువాత నుండి గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. అప్పటి వరకు పద్దతిగా సినిమాలు చేసిన ఆమె.. రౌడీ బాయ్స్ సినిమా నుండి గ్లామర్ డోస్ ను పెంచేసింది. అది చూసిన ఆమె ఫ్యాన్స్ అక్కసారిగా అవాక్కయ్యారు. ఇదెక్కడి మాస్ అనుపమా అంటూ కామెంట్స్ చేశారు. 

ఇక తాజాగా ఆమె హీరోయిన్ నటిస్తున్న టిల్లు స్క్వైర్ మూవీ రిలీజ్ కు సిద్ధమయ్యింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న ఈ సినిమా మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్టీ భారీ విజయం సాధించిన నేపధ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో కూడా తన గ్లామర్ షోతో రెచ్చిపోయింది అనుపమా. లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది.

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి  హో మై లిల్లీ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా మీడియా మీట్ కూడా నిర్వహించారు మేకర్స్. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ అనుపమాను సడన్ గా బోల్డ్ పాత్రలు చేయడానికి కారణం ఏంటి? అని అడిగాడు. దానికి సమాధానంగా.. రోజు అన్నమే తినాలంటే కష్టం కాదా.. అప్పుడప్పుడు బిర్యానీ, పులావ్ కావాలి. మనం వేసుకునే దుస్తులు కూడా ఒకేరకంగా ఉంటె మనకే నచ్చవ్.. అందుకే అలా చేశా. ఏదైనా మా డైరెక్టర్ నాకు ఇచ్చిన పనిని పూర్తి చేయడం నా భాద్యత.. అంటూ అంతకన్నా బోల్డ్ గా సమాధానం ఇచ్చింది అనుపమా. ప్రస్తుతం అనుపమా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.