- ఇషా గోల్డెన్ షూట్
- కాంతిశ్రీ‑జూహిత్‌కు బ్రాంజ్
అహ్మదాబాద్: నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్ల పతక జోరు కొనసాగుతోంది. తొలి రోజు రియా బంగారు పతకాల బోణీ చేయగా.. టీనేజ్ షూటింగ్ సెన్సేషన్ ఇషా సింగ్ అంచనాలను అందుకుంటూ గోల్డెన్ షూట్ చేసింది. స్కేటింగ్‌లో అనుపోజు కాంతిశ్రీ–జూహిత్ జంట బ్రాంజ్ గెలిచింది. ఇంటర్నేషనల్ ఈవెంట్లలో జోరును కొనసాగించిన ఇషా సింగ్ బలమైన పోటీ ఉన్న విమెన్స్ 25మీ. పిస్టల్ ఈవెంట్‌లో గోల్డ్ సాధించింది.శనివారం జరిగిన ఫైనల్లో 26 పాయింట్లతో ఆమె స్వర్ణం గెలవగా.. రిథమ్ సాంగ్వాన్(హర్యానా) 25 పాయింట్లతో సిల్వర్ నెగ్గింది.
అభింద్యన అశోక్ (మహారాష్ట్ర) 19 పాయింట్లతో బ్రాంజ్ ఖాతాలో వేసుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లోనూ 584 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించింది. ఒలింపియన్ మను భాకర్ (583) రెండో ప్లేస్‌లో నిలిచింది. అయితే, మెడల్ రౌండ్‌లో భాకర్ నిరాశ పరిచింది. రోలర్ స్కేటింగ్ ఆర్టిస్టిక్ కపుల్ డ్యాన్స్‌లో కాంతిశ్రీ-–జూహిత్ ద్వయం 71 స్కోరుతో మూడో స్థానంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది.
జ్యోతికి గోల్డ్, జ్యోతికశ్రీ, రాజుకు సిల్వర్
అథ్లెటిక్స్‌లో ఏపీ యువ అథ్లెట్ యెర్రాజి జ్యోతి విమెన్స్ 100 మీ. ఈవెంట్‌లో బంగారు పతకం గెలిచింది. ఫైనల్ రేసును ఆమె 11.51 సెకండ్లలోనే పూర్తి చేసి పోడియం ఫినిష్ చేసింది. తమిళనాడుకు చెందిన అర్చన (11.55సె), మహారాష్ట్ర అథ్లెట్ దియంద్ర (11.62 సె) సిల్వర్, బ్రాంజ్ గెలిచారు. విమెన్స్ 400 మీ. రేస్‌లో ఏపీకి చెందిన దండి జ్యోతికశ్రీ 53.30 సెకండ్లతో సిల్వర్ కైవసం చేసుకుంది. మెన్స్ వెయిట్ లిఫ్టింగ్ 67 కేజీ క్లాస్ ఫైనల్లో కె. నీలం రాజు 270 (స్నాచ్124+జెర్క్146) బరువెత్తి రెండో స్థానంతో రజతం గెలిచాడు. మెన్స్ 100 మీ. రన్‌లో అసోం స్టార్ అథ్లెట్ అల్మన్ బోర్గొహైన్ (10.28 సె) గోల్డ్ సొంతం చేసుకోగా.. షాట్‌పుట్‌లో సర్వీసెస్ స్టార్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ 20.75 మీటర్లతో నేషనల్ గేమ్స్ రికార్డును బ్రేక్ చేస్తూ స్వర్ణం నెగ్గాడు.
