
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనుష్క.. గత కొంత కాలంగా స్పీడు తగ్గించింది. ‘నిశ్శబ్ధం’ తర్వాత తన నుండి మరో సినిమా రాలేదు. దీంతో అనుష్క సినిమా కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో ఆమె నటిస్తోంది. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కు గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. డిసెంబర్ ఎండింగ్‌కు షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది. ఇది ఆలస్యమైనప్పటికీ ఇకపై మాత్రం వెంటవెంటనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయిందట అనుష్క.
అందుకే ఈ మూవీ పూర్తవకముందే మరో కొత్త సినిమాకు సైన్ చేసింది. తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపొందబోతోంది. గతంలో ఇదే దర్శకుడు తీసిన ‘నాన్న’ చిత్రంలో నటించింది అనుష్క. అందులో లాయర్‌గా కనిపించిన ఆమె, ఈసారి ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతోందట. ఇదో యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలవుతుందని ఇటీవల విజయ్ కన్‌ఫర్మ్ చేశాడు. గతంలో ‘బిల్లా’ మొదలు చాలా చిత్రాల్లో యాక్షన్ రోల్స్‌లో కనిపించిన అనుష్క, కొంత గ్యాప్ తర్వాత మరోసారి అలాంటి పాత్రలో మెరవబోతోంది. ఇక ఈ సినిమాతో 49 సినిమాలు పూర్తి చేస్తోన్న ఆమె, 50వ సినిమా ఎవరి డైరెక్షన్‌లో చేస్తుందో చూడాలి!