సెలబ్రిటీలైతే రూల్స్ బ్రేక్ చేస్తారా.. అనుష్కకు పోలీసుల వార్నింగ్

సెలబ్రిటీలైతే రూల్స్ బ్రేక్ చేస్తారా.. అనుష్కకు పోలీసుల వార్నింగ్

సెలబ్రిటీలు అయితే ఎం చేసిన చెల్లుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే. ముంబై పోలీసులు ఇది మరోసారి ప్రూవ్ చేశారు. తాజాగా మే 15న బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సడన్ గా రోడ్ మీద బైక్ పై ప్రత్యేక్షమైంది. ఆమె షూటింగ్ వెళ్తున్న రూట్ లో చెట్టు కొమ్మ విరిగి పడటంతో హెవీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఆలస్యం అవుతుందని గమనించిన అనుష్క వెంటనే కారు దిగి పక్కనే ఉన్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి అతని బైక్ పై షూటింగ్ కు వెళ్ళింది.

దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  అయితే.. ఈ వీడియోలో బైక్ రైడ్ చేసిన వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో కొంతమంది వారు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారన్న విషయాన్ని గమనించి ఆ వీడియోను ముంబై పోలీసులకు ట్యాగ్ చేశారు. ఎంత సెలబ్రిటీలు అయితే మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తారా హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేశారు.

అది గమయించిన ముంబై పోలీసులు ఆ బేక్ పై 129/194, Sec 5/180 & Sec 3(1)18 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి హెల్మెట్ ధరించనందుకు రూ. 10,500 ఫైన్ విధించారు. అంతేకాదు అనుష్క శర్మకు తమ స్టైల్లో వార్నింగ్ కూడా ఇచ్చారు. సెలబ్రిటీలు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల అది అభిమానులపై  ప్రభావం చూపెడుతుందని, ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీలు జాగ్రత్తగా లేకుంటే. ఫ్యాన్స్ లో చులకన అయ్యే అవకాశం ఉందిని సూచించారు.