GHAATI: అనుష్క-క్రిష్ మూవీ వచ్చేస్తోంది.. ‘ఘాటి’ రిలీజ్ ఎప్పుడంటే?

GHAATI: అనుష్క-క్రిష్ మూవీ వచ్చేస్తోంది.. ‘ఘాటి’ రిలీజ్ ఎప్పుడంటే?

అనుష్క శెట్టి లీడ్ రోల్‌‌లో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఘాటి’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌‌తో అనుష్క ఇంటెన్స్‌‌ క్యారెక్టర్‌‌‌‌ను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా రిలీజ్‌‌ డేట్‌‌పై అప్‌‌డేట్ ఇచ్చారు.

జులై 11న ఈ సినిమా విడుదల కాబోతోందని సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో  అనుష్క, విక్రమ్ ప్రభు నది గుండా సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని తెలియజేసేలా ఉంది.‘వేదం’తర్వాత అనుష్క, క్రిష్‌‌ కాంబినేషన్‌‌లో వస్తోన్న రెండో సినిమా ఇది.

అలాగే యూవీ క్రియేషన్స్‌‌తో అనుష్కకు ఇది నాలుగో సినిమా.  చింతకింది శ్రీనివాసరావు కథను అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. పాన్‌‌ ఇండియా వైడ్‌‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన అనుష్క  గ్లింప్స్‌‌తో పాటు తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇంటెన్స్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.