Anushka Shetty: కథానర్లో అనుష్క మరింత అందంగా..లేటెస్ట్ లుక్తో ఫ్యాన్స్ ఖుషి

Anushka Shetty: కథానర్లో అనుష్క మరింత అందంగా..లేటెస్ట్ లుక్తో ఫ్యాన్స్ ఖుషి

లేడీ ఓరియెంటెడ్‌‌ సినిమాలకు కేరాఫ్‌‌ అడ్రస్‌‌గా మారిన అనుష్క(Anushka Shetty).. గత కొంత కాలంగా స్పీడు తగ్గించింది. ‘నిశ్శబ్ధం’ తర్వాత తన నుండి రెండేళ్లు అయిన సినిమా రాకపోయేసరికి..ఇక అనుష్క సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిందని వార్తలు వచ్చాయి. ఇక ఆ వెంటనే యంగ్ హీరో నవీన్‌‌ పొలిశెట్టితో కలిసి ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో నటించి మెప్పించింది.దీంతో స్వీటీ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. 

అయితే అనుష్క మాత్రం ఇప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేవలం డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తోంది.చేసేది చిన్న పాత్ర అయినా సరే..కథలో ఇంపార్టెన్స్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. అయితే, ఇక్కడ  బాహుబలి తర్వాత తన మునుపటి అందాన్ని కోల్పోయింది అనేలా ఆ మధ్య చాలా రకాల కామెంట్స్ అయితే వచ్చాయి.

లేటెస్ట్గా అనుష్క కథానర్ (Kathanar) అనే ఒక మలయాళం సినిమా చేస్తోంది.ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో అనుష్క ఇంతకుముందు సినిమాల కంటే చాలా అందంగా కనిపిస్తోంది. అంతేకాదు అనుష్క బరువు తగ్గి మరి క్యూట్ గా ఉంది.

పిరియడ్ ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను మలయాళం టాలెంటెడ్ దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి తాజాగా అనుష్క దర్శక నిర్మాతలతో కలిసి ఒక ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో జయసూర్య,వినీత్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.