మరో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌ లో అనుష్క

 మరో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌ లో అనుష్క

మిస్‌‌‌‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది అనుష్క. తాజాగా సెన్సార్‌‌‌‌‌‌‌‌ కూడా పూర్తయిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌‌‌‌కు ముందే మరో సినిమాకు సైన్ చేసింది అనుష్క. ‘కథనార్‌‌‌‌.. ది వైల్డ్ సోర్సెరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో రూపొందుతున్న ఫాంటసీ హారర్‌‌‌‌‌‌‌‌ డ్రామాలో ఆమె నటించబోతోంది. మలయాళ స్టార్ జయసూర్య హీరోగా రోజిన్ థామస్‌‌‌‌ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల జయసూర్య బర్త్‌‌‌‌ డే సందర్భంగా విషెస్ చెబుతూ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. 

అతీంద్రియ శక్తుల నేపథ్యంలో హారర్, థ్రిల్లింగ్ విజువల్స్‌‌‌‌తో కట్ చేసిన వీడియో గ్లింప్స్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. అరుంధతి, భాగమతి చిత్రాల తరహాలో మరో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌ను‌‌‌‌ అనుష్క ఇందులో పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె నటిస్తున్న ఫస్ట్ మలయాళ సినిమా ఇది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌‌‌ని వచ్చే ఏడాది విడుదల చేస్తామన్నారు. భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, చైనీస్, జపనీస్‌‌‌‌, కొరియన్, ఇటాలియన్, ఇండోనేషియన్, రష్యన్, జర్మన్ భాషలు కలుపుకుని మొత్తం  పద్నాలుగు భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు.