Anushka Kaithi2: లోకేశ్ కనగరాజ్ ఖైదీ 2లో అనుష్క.. ఢిల్లీ పాత్రకు ధీటుగా.. స్వీటీ రోల్ ఇదే!

Anushka Kaithi2: లోకేశ్ కనగరాజ్ ఖైదీ 2లో అనుష్క.. ఢిల్లీ పాత్రకు ధీటుగా.. స్వీటీ రోల్ ఇదే!

టాలీవుడ్లో తనదైన శైలి ముద్ర వేసిన ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. తన నటనతో ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కింగ్ నాగార్జున 'సూపర్' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ తెలుగు, తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది.

అయితే కోవిడ్ తర్వాత సినిమాల విషయంతో కాస్తా స్లో అయ్యిన స్వీటీ.. చివరగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' చిత్రంలో నటించింది. ప్రస్తుతం 'ఘాటి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ వచ్చే నెల 11న ప్రపంచవ్యా ప్తంగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే..

లేటెస్ట్గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు సినిమాలో అనుష్క నటిస్తుందని టాక్. కార్తి ఖైదీ 2లో అనుష్క నటిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో ఆమె లేడీ డాన్ పాత్రలో కనిపించబోతుందని.. ముఖ్యంగా అనుష్క క్యారెక్టర్ చాలా రగ్గడ్గా, రఫ్గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం డైరెక్టర్ లోకేష్ కూడా ఎక్కడ రాజీ పడకుండా దీటుగా అవుట్ ఫుట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడట. అంతేకాదు.. ఢిల్లీ (కార్తి) పాత్రకు ధీటుగా.. స్వీటీ రోల్ను డిజైన్ చేసాడట లోకేష్ 

ఇదే కనుక నిజమైతే ‘ఖైదీ 2'పై అంచనాలు మరింత పెరిగే  ఛాన్స్ ఉంది. 'బిల్లా'లో డాన్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అనుభవం అనుష్కకు ఉంది. కెరీర్ ఆరంభంలో నటించిన సూపర్ చిత్రంలోనూ సూపర్ లేడీగా కనిపించింది. అన్నీ కుదిరితే ఖైదీ 2మూవీ.. అనుష్క కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయంపై లోకేష్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఖైదీ 2..LCUలో పీక్‍గా ఉంటుందని గతంలోనే లోకేశ్ కనగరాజ్ చెప్పారు. LCU లోని మెయిన్ క్యారెక్టర్లన్నీ ఈ చిత్రంలో ఉంటాయన్నారు. ఢిల్లీ త్వరలో మళ్లీ వస్తారని కూడా తెలిపారు. ప్రస్తుతం లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్‍ కూలీ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆగష్టు 14న కూలీ విడుదల కానుంది. ఆ తర్వాత ఖైదీ 2ని మొదలు పెట్టనున్నారు లోకేష్.