Anushka Shetty: "సీతమ్మోరు లంక దహనం చేస్తే"... 'ఘాటి' ట్రైలర్‌తో అంచనాలు పెంచిన అనుష్క!

Anushka Shetty: "సీతమ్మోరు లంక దహనం చేస్తే"...  'ఘాటి' ట్రైలర్‌తో అంచనాలు పెంచిన అనుష్క!

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ( Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఘాటి' ( Ghati Movie ).  ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతున్న వస్తున్న ఈ మూవీపై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో విక్రమ్ ప్రభు ( Vikram Prabhu )నటించారు. డైరెక్టర్ క్రిష్ ( Krish ) దర్శకత్వంలో తెరక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరాయి. 

ఈ ట్రైలర్ విడుదల తర్వాత అభిమానుల్లో అంచాలు మరింత పెరిగాయి. 'ఘాటి' ట్రైలర్‌ ( Ghati trailer ) ను పరిశీలిస్తే, ఈ చిత్రం గంజాయి మాఫియా నేపథ్యంలో రూపొందించినట్లు స్పష్టమవుతోంది. "ఘాట్లలో గాటీలు ఉంటారు సార్" అనే శక్తివంతమైన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. గంభీరమైన వాయిస్ ఓవర్‌, ఉద్వేగభరితమైన సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఇందులో అనుష్క మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, 'అరుంధతి' తరహాలో ఆమె రౌద్రంగా, శక్తివంతంగా కనిపించారు.

ట్రైలర్ చివరిలో వచ్చే "సీతమ్మోరు లంక దహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురు గానీ" అనే డైలాగ్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అనుష్క పాత్ర యొక్క శక్తిని, ఆమె పోరాట పటిమను ఈ డైలాగ్ సూచిస్తుంది. ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించడానికి ఈ ఒక్క డైలాగ్ సరిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 
 
 యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మూవీ మేకర్స్ ప్రకటించారు.  'ఘాటీ ' సినిమాను సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.