మోడీతో ఏదైనా సాధ్యమే: ఫడ్నవీస్

మోడీతో ఏదైనా సాధ్యమే: ఫడ్నవీస్

మహారాష్ట్రలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాత్రికి రాత్రే మార్పులు జరిగి ఇవాళ దేవేంద్ర ఫడ్నవిస్ మహా సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముంబైలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఫడ్నవీస్. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మోడీతో ఏదైనా సాధ్యమేనన్న ఫడ్నవీస్… అజిత్‌ పవార్‌ సహకారంతో మహారాష్ట్రలో బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

కొన్ని రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఇవాళ్టి(శనివారం)తో ముగిసాయి. అజిత్‌ పవార్‌ ఆధ్వర్యంలో NCPకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించడంతో..మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, , డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణ స్వీకారం చేశారు.